August 23, 2025

బోనాల పండగ

బోనాల పండగ
తెలుగు ర్యాప్ సాంగ్ (2025)
దశగ్రీవ ట్రూప్

ఓ మై గాడ్... 
క్లానీ...
సాంబ్రాణి ఊదు పొగలు 
మా ఫలహారం బండ్లు 
ఆ పెద్ద తొట్టెలు 
డప్పుల సప్పుడు 
కొట్రా కొట్రా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆడు ఆడు ఆడు ఆడు 
బోనాల పండగ జోరుదార్ 
దుగ్గి లేపి మార్ మార్ 
ఏక్ దో తీన్ మార్
ఆడు ఆడు ఆడు ఆడు 
బోనాల పండగ జోరుదార్ 
ఏక్ దో తీన్ మార్
ఆడు ఆడు ఆడు ఆడు 

ఆ గజ్జెల సప్పుడు ఇన్నవా 
మా పోతరాజుని చూసినవా  
సురుకు దెబ్బ తిన్నవా 
తిన్నవా తిన్నవా
ఆ గజ్జెల సప్పుడు
మా పోతరాజు
సురుకు దెబ్బ
పోతరాజు ఆడ్తుండు 
చూసి నువ్వు కొట్టు 
గల్ గల్ గల్ గల్
అందరు ఆడేటట్టు 
చిట్కి మెల్లగ లేపు 
నువ్వు డుగ్గి ఇట్ల కొట్టు 
రిగి బాప్పా 
రిగి బాప్పా 
రిగి బాప్పా 
రిగి బాప్పా 
పట్నమంత పండగ 
బస్తి బస్తి జాతర 
దశగ్రీవ పాటవెట్టి 
రంగమెక్కు ఊఁ...
బోనాల పండగ జోరుదార్ 
దుగ్గి లేపి మార్ మార్ 
ఏక్ దో తీన్ మార్
ఆడు ఆడు ఆడు ఆడు

లైటింగ్ చూడు 
చమక్ చమక్  
డ్రిప్ ఏసినమ్ 
ఖద్దర్ కడక్ 
దోస్తులంత ఫుల్ షాన్లా
తెలుసు కదా 
షటక్ మటక్ 
ప్యారీని జర చూసినవా 
లంగా ఓణీల కిరాక్ 
కాటుక పెట్టిన కళ్ళు దాన్వి 
అబ్బబ్బబ్బబ్బా 
ప్యారీని జర చూసినవా 
లంగా ఓణీల కిరాక్ 
కాటుక పెట్టిన కళ్ళు చూస్తే 
గుండె లటక్ పటక్
అరే ఊపుకుంట వోకే
ఇస్తున్నవ్ ఝలక్ 
కన్నుకొడితే ప్యారీ 
పోజు కొడుతుందీ కడక్ 
ఆ నవ్వు 
కొప్పులో పెట్టింది పువ్వు 
మనసు నాది 
చెప్తుంది నంబర్ ఇవ్వు ఇవ్వు 
దాన్నవ్వు 
కొప్పులో పెట్టింది పువ్వు 
మనసు నాది 
చెప్తుంది నంబర్ ఇవ్వు ఇవ్వు

అమ్మా నీ ముందు 
మంచోడొచ్చిండు 
చెడ్డోడొచ్చిండు  
లంగోడొచ్చిండు 
దొంగోడొచ్చిండు
బస్తోడొచ్చిండు    
బయటోడొచ్చిండు
భయంతోనొచ్చిన్రు 
భక్తితోనొచ్చిన్రు

మెట్టుగూడ నల్లపోచమ్మ 
గడ్డపైన పెద్దపోచమ్మ 
కట్టకాడ కట్టమైసమ్మ  
బంగారు మైసమ్మ 
జూబిలీ హిల్స్ పెద్దమ్మ 
బల్కంపేట ఎల్లమ్మ 
మాంకాళమ్మ 
గండిపేటలున్న గండమ్మ
ముత్యాలమ్మ 
మా నల్లపోచమ్మ
బోనాల పండగ

తల్లికి బాధొస్తే చెప్పినం
మంచైతే మొక్కినం 
పండగ నీకే చేసినం 
నీ పండగ మాకు సంబరం 
సన్న సన్న వాన 
దో మార్ ఆట 
డీఆర్‌సి పాట 
చిందు చిందు ఆట 
మా పోతరాజు ఆట 
మా పహిల్వాన్ ఆట 
శివ సత్తుల ఆట 
మా పిల్లగాళ్ళ ఆట 
అన్ని మర్చి సంబరంతో 
ఖుష్ ల ఆడే ఆట 
డప్పు సప్పుడు విని 
శిగమూగే ఆట 
ఓం బలి 
బలి బలి
ఓం బలి 
బలి బలి