June 25, 2025

పోత పోత పైసలన్ని

పోత పోత పైసలన్ని
తెలుగు ర్యాప్ సాంగ్ (2025)
దశగ్రీవ ట్రూప్ 

ఓ మై గాడ్... క్లామీ ...
అరె 
ఎవరేం చేస్తారో చెయ్యనీ
నాకుంది భేటే నా పని
నా పాట గుంజేస్తది నీ ఆత్మని
ఒక్క లైన్‌తోని దింపేస్తా బాధని 

హే హే 
ధోఖ ఇస్తే ఒద్లేయాలె దోస్తుని 
మత్లబ్‌లా చేస్తున్నరు నాకాని 
పోవలంటె ముందుకు ఇడ్షవెట్టరా పాస్ట్‌ని 
మీరు ఇంకా ఛోటబచ్ఛా నేను మాస్టర్‌ని 

June 22, 2025

గోల్డెన్ స్పారో

జాబిలమ్మ నీకు అంత కోపమా (2025)
గానం: అస్విన్ సత్య, సుధీష్ శశికుమార్, సుబ్లాషిని 
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్ 
సాహిత్య: రాంబాబు గోసాల 

వాకింగ్ స్లోమో...
మనసులో శోకం

హేయ్ మై గోల్డెన్ స్పారో

హేయ్.. హేయ్..
మామా.. మామా 
కమ్ అండ్ సింగు
క్వీనే వచ్చెను నువ్వే కింగు
డోలు భాజా పీపీ డుండుం
మెళ్ళో మాలతొ పెట్టెయ్ రింగు

గోల్డెన్ స్పారో 
నా గుండెలో యారో
నువ్వులేని లైఫు 
హే ఫుల్ సారో
మాస్క్ అఫ్ జారో
అబ్బ మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో

కపుల్ కపుల్ గోల్-లు
నే సింగిల్ గున్న గర్ల్-లు

హేయ్ .. 
సంగతి చెప్పమంటే నాకు వాడే చాలు
హేయ్.. 
చక్కని చుక్కని నేను 
ఒక్క చూపుతో పడేస్తాను
హేయ్ 
టెక్కుల ట్రిక్కుల జాను
నే మిలమిల మూను

గోల్డెన్ స్పారో 
నా గుండెలో యారో
నువ్వులేని లైఫు 
హే ఫుల్ సారో
మాస్క్ అఫ్ జారో
అబ్బ మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో

June 17, 2025

అట్టు అట్టు పెసరట్టు

చిత్రం: శాంత (1961)
గానం: స్వర్ణలత, పిఠాపురం నాగేశ్వరరావు
సంగీతం: రమేష్ నాయుడు 
రచన: కొసరాజు

పల్లవి : 

అట్టు అట్టు పెసరట్టు 
అ ఉల్లిపాయ పెసరట్టు 
ఉప్మాతో జతపెట్టు 
భల్ చెట్నీతోటి కలేసికొట్టు  
అట్టు అట్టు పెసరట్టు 
అహ ఉల్లిపాయ పెసరట్టు

June 15, 2025

నాన్నా నీకై ప్రాణం ఇవ్వనా

ఆనిమల్ (2023)
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ 
గానం: సోనూ నిగమ్ 
ఆర్. పి. కృష్ణాంగ్ (చైల్డ్ వెర్షన్)
రచన: అనంత శ్రీరామ్

పల్లవి:

నా సూర్యుడివి 
నా చంద్రుడివి
నా దేవుడివీ నువ్వే

నా కన్నులకి
నువ్వు వెన్నెలవి
నా ఊపిరివి నువ్వే

నువ్వే కదా 
నువ్వే కదా
సితార నా కలకీ

నాన్నా నువ్వు నా ప్రాణం అనినా
సరిపోదట ఆ మాట
నాన్నా నీకై ప్రాణం ఇవ్వనా
ఇదిగో ఇది నా మాట

నిజాన్నిలా అనేదేలా
ఇవ్వాళ నీ ఎదుటా

June 14, 2025

దారిపొంటత్తుండు

దారిపొంటత్తుండు
తెలంగాణా జానపదం
సంగీతం: ఎస్ కే మదీన్ 
సాహిత్యం: మామిడి మౌనిక 
గాయని: మామిడి మౌనిక 

పల్లవి: 

ఆహా 
దారిపొంటత్తుండు 
దవ్వ దవ్వొత్తుండు
దారిద్దునా వోనిద్దునా
జోరు మీదొత్తుండు 
కారు మీదొత్తుండు
తోలేద్దునా పోనీ ఊకుందునా

దారిపొంటత్తుండు రానిద్దునా
తొవ్వ పొంటత్తుండు వోనిద్దునా
నా ఎనక నా ఎనక నా ఎనక నా ఎనక
నా ఎనక పడుతుండు 
నా ముందుటుంటుండు
సందిద్దునా వద్ద వందిద్దునా
ఇనుకుంట పోతాండు 
అనుకుంట వత్తాండు
బందైదునా 
బంధమై చూపనా