May 27, 2023

ఆటాడుకుందాం రా...

ఆటాడుకుందాం రా...
చిత్రం: సిసింద్రీ (1995)
సంగీతం: రాజ్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, బాలు 

పల్లవి:

ఆటాడుకుందాం రా అందగాడా 
అందరా చందురూడా

అల్లేసుకుందాం రా మల్లెతీగ 
ఒప్పుకో సరదాగా

సై సై అంటా.... హోయ్ హోయ్
చూసేయ్ అంతా... హోయ్ హోయ్

నీ సొమ్మంతా.... హోయ్ హోయ్
నాదేనంట... హోయ్ హోయ్

చరణం 1:

ఓరి గండుతుమ్మెదా  
చేరమంది పూపొదా

ఓసి కన్నె సంపదా 
దారి చూపుతా.. పదా

మాయదారి మన్మథ 
మరీ అంత నెమ్మదా

అంత తీపి ఆపదా 
పంటనొక్కి ఆపెదా

వయస్సుంది వేడి మీద 
వరిస్తోంది చూడరాద

తీసి ఉంచు నీ ఎదా  
వీలుచూసి వాలెదా
ఓ రాధ నీ బాధ 
ఓదార్చి వెళ్లేద

చరణం 2:

ముద్దుముద్దుగున్నది 
ముచ్చటైన చిన్నది

జోరుజోరుగున్నది 
కుర్రవాడి సంగతి

హే నిప్పు మేలుకున్నది
తప్పు చేయమన్నది

రెప్పవాలకున్నది
చూపు చుర్రుమన్నది

మరి లేతగుంది బాడి 
భరిస్తుంద నా కబాడి

ఇష్టమైన ఒత్తిడి ఇంపుగానే ఉంటది
ఇందాక వచ్చాక సందేహమేముంది..?