May 21, 2023

ఒక్కసారి నవ్వు

ఒక్కసారి నవ్వు
చిత్రం: సింహం నవ్వింది (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: నందమూరి రాజా, యస్. జానకి 

పల్లవి:

ఒక్కసారి నవ్వు ఒక్క ముద్దు ఇవ్వు 
లేతలేత వయసు నేడు కూత వేయగా 
చిలిపి చిలిపి తలపులన్ని చిటికెలేయగా 

ఒక్కసారి నవ్వు ఒక్క ముద్దు ఇవ్వు 
మల్లెపూల పిల్లగాలి బుజ్జగించెనా 
మొగ్గలాంటి బుగ్గమీద మోజుపుట్టెనా 

చరణం 1: 

ఏవో ఊహలు ఎన్నో ఊసులు 
ఇన్నినాళ్ళు దాచుకున్నాను 

నిన్నే నేనుగ నీవే నేనుగ 
ఎన్నిసార్లు పిలుచుకున్నాను 

తోడుగా ఆడుకో 
జోడుగా పాడుకో 

ఏరులాగ పొంగిపొంగి నన్ను అందుకో 
బంతిలాగ ఎగిరి ఎగిరి నన్ను చేరుకో 

కోరుకున్న కన్నెమనసు సేదతీర్చుకో 

కొంటెకళ్ళలోన నన్ను కట్టివేసుకో 

చరణం 2: 

నీతో జంటగ నీ వెనువెంటగ 
నీడ లాగ సాగిపోనీ 

ఎంతో తీయగ మనసే తీరగ 
వింతకబురు లాడుకోనీ 

ఓ క్షణం ఉండిపో 
గుండెలో నిలిచిపో 

దానిలోన నా పేరు దాగివున్నది 

నన్నుచూసి కన్నుకొట్టి నవ్వుకున్నదీ 

చిన్న నడుము ఊగుతుంది చిత్రమేమిటీ 

ఇంటికెళ్ళమంటూంది సందె చీకటి