May 27, 2023

ఎలా ఎలా నీకుంది

ఎలా ఎలా నీకుంది 
చిత్రం: సింహం నవ్వింది (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: నందమూరి రాజా, యస్. జానకి 

పల్లవి:

ఎలా ఎలా నీకుంది
భలేభలే బాగుంది 

కలిగిన కదలిక అదో రకం 
తెలిసీ తెలియని ఇదో సుఖం 


చరణం 1:

బుగ్గమీద బుగ్గ చేర్చి 
ముద్దుమీద ముద్దులుంచి 
పొద్దూ మరచీ హద్దూ మరచీ ఉందామా 

అమ్మ దొంగా ఎంత ఆశ?
కళ్ళనిండా కొంటె బాస 
గుండెల్లోనా అలరిపెడితే ఉండగలనా 

తొలితొలి కోరికలోనా 

పలికిన గీతిక లోనా

పగలే జాబిలి పొడిచింది 

మదిలో వెన్నెల పరిచింది 

చరణం 2:

చిందులేసే అందముంటే 
ఈలవేసే వేళ ఉంటే 
ఊరికె చూస్తూ గుటకలు వేస్తూ ఉంటానా?

తాకగానే తాపమైతే 
ఊపిరంతా ఆవిరైతే 
ఓరగ చూసి గారడి చేస్తే ఓపగలనా 

గీసిన గీతలు దాటి 

దాచిన వలపులు మీటి 

మరిమరి చెంతకు జరగాలీ 

ఒకరై ఇద్దరం ఒదగాలి