May 21, 2023

గువ్వా గువ్వా ఎక్కడికే

గువ్వా గువ్వా ఎక్కడికే
చిత్రం: సింహం నవ్వింది (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సి. నారాయణరెడ్డి 
గానం: నందమూరి రాజా, యస్. జానకి 

పల్లవి: 
 
గువ్వా గువ్వా ఎక్కడికే 
గూటిలోకా..? 
తోటలోకా ....?
గారంగా వయ్యారంగా 
సింగారంగా బంగారంగా 
చేరేది పొదరింటి మాటులోకా..?

చరణం 1:

ఉరికితె ఆగని పరుగు 
ఎగిరితె దాగని పొంగు 
వీచే గాలి పూచే పూలు 
వేచేదెందుకో రెమ్మల నడుగు 

రివరివలు ఆ రెపరెపలు 
హుషారుగ ఊయల ఊగడానికా?
 
చరణం 2:

నీటికి పల్లం తెలుసు 
వయసుకు అల్లరి తెలుసు 
కదిలే మబ్బు 
కదిలే పొద్దు 
పదపదమన్నవి ఎందుకో తెలుసు 
చకచకలు నీ పకపకలు 
సరాసరి పానుపు చేరడానికా