జాబిలి వచ్చింది
చిత్రం: సింహం నవ్వింది (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: నందమూరి రాజా, యస్. జానకి
పల్లవి:
జాబిలి వచ్చింది
జాజులు తెచ్చింది
జెడలో తురిమింది
గడుసుగ నవ్వింది
కళ్ళలో కళకళా
గుండెలో మిలమిలా
జాబిలి వచ్చింది
జాజులు తెచ్చింది
పాన్పున చల్లింది
పకపక నవ్వింది
కళ్ళలో కళకళా
చరణం 1:
పిలవక పలికే చిరుగాలి
పిల్లనగ్రోవిగ మారింది
పులకలు జాదిన కెమ్మోవి
వలపుల రాగం పాడింది
మనసేమో చల్లనా
తనువేమో ఝల్లనా
వయసేమో ఊగిపోయే ఝిల్లనా
శృతిచేసిన వీణపై
సుతిమెత్తని తీగనై
జతకూడి రవళించినా
ఆకాశం రమ్మంది
అవకాశం లెమ్మంది
అంచులు దాటి విహరించనా
చరణం 2:
కలవక కలిసిన తరుణంలో
అలజడి తియ్యగ పెరిగింది
ఉరకలు వేసిన పరువంలో
ఊహల వెల్లువ ఉబికింది
రారాదా చెంతగా
ఎదలో గిలిగింతగా
వేచిందీవేళ ఎంతో వింతగా
క్షణమైనా ఆగకా
వెనుతిరిగి చూడకా
కలకాలం సాగేములే
కాయల పందిరిలోనా
వెన్నెల ఊయలలోనా
కాలం మరిచి ఊగేములే