లాటానుప్రాసాలంకారము
అర్థభేధము లేకపోయి తాత్పర్య భేదము కలుగునట్లు ఒక పదము రెండు సార్లు ప్రయోగింపబడిన అది లాటానుప్రాసము. లాట దేశ ప్రజలు ప్రేమించు అనుప్రాసము.
ఉదాహరణలు:
•కమలాక్షు నర్చించు కరములు కరములు (పోతన భాగవతం; మొదటి కరము సామాన్యము, రెండవది శ్రేష్టము)
- శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ,
- సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు,
- శేషశాయికి మ్రొక్కు శిరము శిరము,
- విష్ణు నాకర్ణించు వీనులు వీనులు,
- మధువైరి తవిలిన మనము మనము,
- భగవంతు వలగొను పదములు పదములు,
- పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని జింతించు దినము దినము,
- చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు,
- కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు,
- తండ్రి హరిజేరు మనియెడు తండ్రి తండ్రి
- మానవత్వము గలుగు మనిషి మనిషి.
- తల్లిదండ్రులను సేవించు సుతులు సుతులు.
నీ పని నీ చాటు పని రసలీల లాడుకున్న రాజసాల పని (అన్నమయ్య)
నా పని అందాల పని ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని
ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆ పని
రేపని మరిమాపని క్షణమాపని మాపని (మాపు, క్షణము ఆపని, మా పని)
ఆ పని ఏదో ఇపుడే తెలుపని.. వలపని
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా....
వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా (అర్జున్)
హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా
మథుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి
జాజిమల్లెల ఘుమఘుమల జావళి
లేతసిగ్గుల సరిగమల జాబిలి
అమ్మా మీనాక్షీ ఇది నీ మీనాక్షి
దీన్లో శ్లేషలు గుప్పిళ్లతో చల్లాడు వేటూరి. మథుర – మధురతర, దగ్గరగా వినిపించే మాటలు కాని అర్థాలు దూరం. ఐనా పక్కపక్కన వినిపించి ఆనందాన్ని కలిగిస్తాయి. కంచిపట్టున – కంచి అనే వూళ్లో ఉన్న అని, కంచిలో నేసిన పట్టుచీర కట్టిన అని రెండర్థాల శ్లేష. ఇక చివరిభాగంలో “చిలక” అనే పదాన్ని రకరకాలుగా చిలికేశాడు. ఒక అర్థం చిలక; పక్షి అని, మరో అర్థం చిలికించటం అని; చిలకరించు, ఇంకో అర్థం ఒక ప్రదేశంలో ఉండేదని, ఒక తీపి పదార్ధము, ప్రసరించు, చల్లు, బాణము, కిళ్ళీ, బీడా, తాళం, మజ్జిగ చిలకడం, చిలకతోటకూర, కొలికిముడి, చివరి అర్థం చిలకటం అని. ఇలా ఒకే పదాన్ని ఇన్ని విధాలుగా ఒకే సినిమా పాటలో ప్రయోగించాడు వేటూరి.
అలానే సితార చిత్రంలో కూడా....
చిలికిన చిలకవు ఉలకవు పలకవు.. ఓ మైనా ఏమైనా
జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన... ఓ మైనా మైనా