April 14, 2020

మాయదారి మాయదారి అందమా...


మాయదారి మాయదారి అందమా
పవిత్ర బంధం (1996)
సిరివెన్నెల
కీరవాణి
బాలు, చిత్ర

పల్లవి:

మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్దమా
హయ్య... హయ్య...హై
మాటకారి మాటకారి బంధమా
మహామాయ చెయ్యవద్దమ్మా
హయ్య... హయ్య...హై
మదిలోన మొదటి ప్రేమ
మితిమీరిపోయె భామా
మది మాటలు మానమ్మా
మల్లెగాలి పైన తేలిరామ్మా

చరణం 1:

మరిగే జాబిలి
కరిగే కౌగిలి
మధనపడే మదనుడికే విందు చెయ్యాలి
పెరిగే ఆకలి
కొరికే చెక్కిలి
మైమరిచి మురిపెముతో కందిపోవాలి
అందించనీ... అధరాంజలి
శృతిమించనీ... జతజావళి
చలిగాలి పైన తేలి
చెలరేగు ఈ ఖవ్వాలీ
ప్రతి పూటా కావాలి
తాళలేని వేళలేని కేళి

చరణం 2:

కుదురే లేదని
ముదిరే బాధని
తెలుసుకుని అలుసుకని ముళ్ళు పడిపోనీ
నిదరే రాదని
అదిరే రాధని
అదుముకొని చిదుముకొని చల్లబడిపోనీ
కసిరే పని కొస రేపని
నిశికైపుని నస ఆపని
రసరాజధానిలోని
రతిరాజుతో జవానీ
సయ్యాటకు సయ్యనని
మోయలేని మోజుతీరిపోనీ

మాయదారి మాయదారి అందమా
ఉయ్యాలాటకింక సిద్దమా
హయ్య... హయ్య...హై
మాటకారి మాటకారి బంధమా
మహామాయ చెయ్యవద్దమ్మా
హయ్య... హయ్య...హై