నిన్నే వలచితినోయి
చిత్రం : పసిడి మనసులు (1970)
సంగీతం : అశ్వద్ధామ
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
నిన్నే వలచితినోయి...
నిన్నే వలచితినోయి...కన్నుల్లో దాచితినోయి
వెన్నెల్లో వేచితినోయీ... నీకై అభిసారికనై ...
ఓ ప్రియా ఆ ...ఆ ...ఆ ....
నిన్నే వలచితినోయి...
చరణం 1 :
మదిలో కోయిల పాడ...మమతల ఊయలలూగ
ఈ రేయి నీకోసం.... వేచితి అభిసారికనై...
ఓ ప్రియా ఆ... ఆ... ఆ ....
నిన్నే వలచితినోయి...కన్నుల్లో దాచితినోయి...
నిన్నే వలచితినోయి...
చరణం 2 :
వెన్నెల కురిసే వేళ... మల్లెలు పూచే వేళ....
విరిసే నిండు వెన్నెల్లో....వేచితి అభిసారికనై...
ఓ ప్రియా ఆ.... ఆ.... ఆ....
నిన్నే వలచితినోయి...కన్నుల్లో దాచితినోయి
వెన్నెల్లో వేచితినోయీ... నీకై అభిసారికనై ...