నా మనసే ఒక తెల్లని కాగితం
చిత్రం : అర్ధాంగి (1977)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
అది ఈనాడైనా ఏనాడైనా..
నీకే నీకే అంకితం..
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
చరణం 1 :
తెరచిన నా కన్నులలో ఎపుడూ నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎపుడూ నీ కలలదీపమే
తెరచిన నా కన్నులలో ఎపుడూ నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎపుడూ నీ కలలదీపమే
కనులే కలలై.. కలలే కనులై
కనులే కలలై.. కలలే కనులై
చూసిన అందాలు అనుబంధాలు..
అవి నీకే నీకే అంకితం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
చరణం 2 :
నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే
పండిన ఆ ధ్యానంలో ఎపుడూ నీ ప్రణయగానమే
నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే
పండిన ఆ ధ్యానంలో ఎపుడూ నీ ప్రణయగానమే
ధ్యానమే గానమై.. గానమే ప్రాణమై
ధ్యానమే గానమై.. గానమే ప్రాణమై
పలికిన రాగాలు అనురాగాలు..
అవి నీకే నీకే అంకితం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం