Showing posts with label శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1987). Show all posts
Showing posts with label శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1987). Show all posts

మల్లిక... పొగడకు


మల్లిక... పొగడకు
శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1987)
చిత్ర, బాలు
ఇళయరాజా
వేటూరి

మల్లిక  పొగడకు
గీతిక పాడకు
కోరిక తాకకు
కోపమా కారణం తెలుసులే
నేరమే చేసిన దోషిని
పెదవుల పొదలో శిక్షను వెయ్యి
కౌగిలి ఉరితో ప్రాణం తియ్యి
వెళ్లిక కారణం
చెప్పను ఎందుకు
చంపకు దేనికి
వేషమే వెయ్యడం నీ తరం
మోసమే చెయ్యడం నీ పరం
నిజము కలలా నువ్వు నేను
అతకదు మనకు పండగ బ్రతుకు

ఇచ్చిన మాటకి నిలవడం తెలియదా
జరిగన కధలనే దాయడం కుదరదా
గుండెలో గాధనే పూలపై రుద్దనా
పెదవిపై బాధనే దానిపై అద్దనా
గుండె మువ్వ గాధ మోవికెంపు బాధ
పొద్దు నవ్వులాగ విచ్చుకునే దారి
ఏదని ఎవరని అడగాలి ఈవేళ
నేరమే చెయ్యను శాపం పెట్టొద్దు

నిన్ననే పూసిన ప్రమిదలో పువ్వుని
నవ్వులో మువ్వని మురిసిన మెరుపుని
పెదవితో ముద్దుల ముగ్గులే వెయ్యకు
హంగుల రంగుల వలలతో ముయ్యకు
తప్పు ఒప్పుకుంటూ శిక్ష వేయమన్నా
నవ్వు రాని శిలకి మ్రొక్కి సుఖము లేదు
కదలదు కరగదు రాతి సంతానం
మనిషితో బంధమే కెరటాలతో స్నేహం