Showing posts with label ప్రేమిస్తే (2005). Show all posts
Showing posts with label ప్రేమిస్తే (2005). Show all posts

జన్మ నీదేలే


జన్మ నీదేలే
ప్రేమిస్తే (2005)
వేటూరి
జోష్వా శ్రీధర్
హరిచరణ్

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికి పోతానే
ప్రియతమా ప్రణయమా కుమలకే ప్రాణమా
అడుగు నీతోనే
జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికి పోతానే

చరణం 1:

కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును
వలచిన హృదయము తెలపదులే
గడ్డిలో పిచ్చిగా పూసిన పువ్వులే
ఎన్నడు దేవత పూజకు నోచవులే
మెరుపుల్లో తీగల మీద మైనా కడుతుందా గూడు
మన ప్రేమకు ఓటమి రానే రాదు
ప్రతి నదికీ మలుపులు తధ్యం బ్రతుకుల్లో బాధలు నిత్యం
ఎద గాయం మాన్పును కాలం
సిరివెన్నెల మాత్రం నమ్మి చిగురాకులు బ్రతుకవు కాదా
మిణుగురులే ఒడి కిరణం

చరణం 2:

తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన చిలుకకు గూడుగ నే ఉన్నా
గుండెపై నీవుగ వాలిన ప్రేమలో ఎదురుగ పిడుగులే పడినను విడువనులే
స్నానానికి వేణ్ణీలవుతా అవి కాచే మంటనవుతా
హృదయంలో నిన్నే నిలిపాలే
నిదురించే కంట్లో నేనే పాపల్లే మేలుకుంటా
కలలోనే గస్తీ కాస్తాలే
నేనంటే నేనే కాదు నువు లేక నేనేలేను
నీ కంటి రెప్పల్లే ఉంటా

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే జతను విడిచావో చితికి పోతానే
ప్రియతమా ప్రణయమా కుమలకే ప్రాణమా
అడుగు నీతోనే..అడుగు నీతోనే ..అడుగు నీతోనే ..అడుగు నీతోనే