Showing posts with label నిరీక్షణ (1981). Show all posts
Showing posts with label నిరీక్షణ (1981). Show all posts

సుక్కల్లే తోచావే


సుక్కల్లే తోచావే
చిత్రం: నిరీక్షణ (1981)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఏసుదాస్

పల్లవి:

సుక్కల్లే తోచావే.. ఎన్నెల్లే కాచావే.. ఏడ బోయావే
ఇన్ని ఏల సుక్కల్లో.. నిన్ను నే నెతికానే
ఇన్ని ఏల సుక్కల్లో.. నిన్ను నే నెతికానే

సుక్కల్లే తోచావే.. ఎన్నెల్లే కాచావే.. ఏడ బోయావే..

చరణం 1:

పూసిందే ఆ పూలమాను నీ దీపంలో..
కాగిందే నా పేదగుండె నీ తాపంలో
ఊగానే... నీ పాటలో ఉయ్యాలై..ఈ..
ఉన్నానే ఈ నాటికి నేస్తాన్నై..ఐ..
ఉన్నా ఉన్నాదొక దూరం.. ఎన్నాళ్లకు చేరం.. తీరందీనేరం..

సుక్కల్లే తోచావే.. ఎన్నెల్లే కాచావే.. ఏడ బోయావే..

చరణం 2:

తానాలే చేశాను నేను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే..ఏ..
ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే..ఏ
ఉందా కనీళ్ళకు అర్థం.. ఇన్నేళ్ళుగా వ్యర్థం.. చట్టందే రాజ్యం..

సుక్కల్లే తోచావే.. ఎన్నెల్లే కాచావే.. ఏడ బోయావే
ఇన్ని ఏలసుక్కల్లో.. నిన్ను నే నెతికానే
ఇన్ని ఏలసుక్కల్లో.. నిన్ను నే నెతికానే

సుక్కల్లే తోచావే.. ఎన్నెల్లే కాచావే.. ఏడ బోయావే..

యమునా ఎందుకె నువ్వూ

యమునా ఎందుకె నువ్వూ
చిత్రం: నిరీక్షణ (1981)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: జానకి

పల్లవి:

హొయిరే రీరే హొయ్యారె హొయీ..
యమునా తీరే హొయ్యారె హొయీ...
యమునా ఎందుకె నువ్వూ ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టతోటి కూడావా
యమునా ఎందుకె నువ్వూ ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టతోటి కూడావా

నల్లా నల్లని వాడు..నిన్ను కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

చరణం 1:

వెన్నంటి వెంటాడి వస్తాడే ముద్దూ
కన్నట్టే గీటేసి పెడతాడె చిచ్చూ
వెన్నంటి వెంటాడి వస్తాడే ముద్దూ
కన్నట్టే గీటేసి పెడతాడె చిచ్చూ

చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడె
చల్లమ్మ బోతుంటె చెంగట్టుకుంటాడె
దారివ్వకే చుట్టూ తారాడుతాడే
పిల్లా పోనివ్వనంటూ చల్లా తాగేస్తడే .. అల్లారల్లరివాడు..అబ్బా ఏం పిల్లడే
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

చరణం 2:

శిఖిపింఛమౌళన్న పేరున్నవాడే..
శృంగారరంగాన కడతేరినాడే ...
శిఖిపింఛమౌళన్న పేరున్నవాడే..
శృంగారరంగాన కడతేరినాడే ...

రేపల్లెలోకల్లా రూపైన మొనగాడె
రేపల్లెలోకల్లా రూపైన మొనగాడె
ఈ రాధకీడైన జతగాడు వాడే

మురళీలోలుడు వాడే..ముద్దూ గోపాలుడే ..
వలపే దోచేసినాడే..చిలిపీ శ్రీకృష్ణుడూ
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

యమునా ఎందుకె నువ్వూ ఇంత నలుపెక్కినావు..రేయి కిట్టతోటి కూడావా

నల్లా నల్లని వాడు..నిన్ను కవ్వించెనా
వలపు సయ్యాటలోనా..నలుపే నీకంటెనా
హొయిరే రీరే హొయ్యారె హొయీ..యమునా తీరే హొయ్యారె హొయీ

తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట

తియ్యన్ని దానిమ్మ
చిత్రం: నిరీక్షణ (1981)
సంగీతం: ఇళయరాజా
నేపధ్య గానం: బాలు, ఎస్. పి. శైలజ

పల్లవి:

తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట
చిన్నారి పొన్నారి చిలకల్ల జంట
చేస్తున్న కమ్మని కాపురమూ
చూస్తున్న కన్నుల సంబరమూ
ప్రేమకు మందిరమూ

తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట
చిన్నారి పొన్నారి చిలకల్ల జంట
చేస్తున్న కమ్మని కాపురమూ
చూస్తున్న కన్నుల సంబరమూ
ప్రేమకు మందిరమూ

తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట
చిన్నారి పొన్నారి చిలకల్ల జంట

చరణం 1:

ఒకదేహం ఒకప్రాణం తమ స్నేహంగా
సమభావం సమభాగం తమ పొందుగా
చిలకమ్మ నెయ్యాలే ఉయ్యాలగా
చెలికాని సరసాలే జంపాలగా
అనురాగం ఆనందం అందాలుగా
అందాల స్వప్నాలే స్వర్గాలుగా
ఎడబాసి మనలేనీ హృదయాలుగా
ముడిపడ్డ ఆ జంట తొలిసారిగా
గూడల్లుకోగా పుల్లల్లుతేగా
చెలికాడు ఎటకో పోగా...
అయ్యో... పాపం...
వేచెను చిలకమ్మ

తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట
చిన్నారి పొన్నారి చిలకల్ల జంట

చరణం 2:

ఒక వేటగాడేందో వలపన్నగా
తిరుగాడు రాచిలుక గమనించక
వలలోన పడి తాను అల్లాడగా
చిలకమ్మ చెలికాని సడికానక
కన్నీరు మున్నీరై విలపించగా
ఇన్నాళ్ళ కలలన్నీ కరిగించగా
ఎలుగెత్తి ప్రియురాలు రోదించగా
వినలేని ప్రియుడేమో తపియించగా
అడివంతా నాడు ఆజంట గోడు
వినలేక మూగైపోగా...
అయ్యో.... పాపం...
వేచెను చిలకమ్మ

తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట
చిన్నారి పొన్నారి చిలకల్ల జంట
చేస్తున్న కమ్మని కాపురమూ
చూస్తున్న కన్నుల సంబరమూ
ప్రేమకు మందిరమూ

తియ్యన్ని దానిమ్మ కొమ్మల్లోనంట
చిన్నారి పొన్నారి చిలకల్ల జంటా...