Showing posts with label అంకురం (1992). Show all posts
Showing posts with label అంకురం (1992). Show all posts

ఎవరో ఒకరు



ఎవరో ఒకరు
అంకురం (1992)
సిరివెన్నెల
హంసలేఖ
బాలు,చిత్ర

ఎవరో ఒకరు ఎపుడో అపుడు...
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు...
అటో ఇటో ఎటో వైపు...

మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి...
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి...
వెనుక వచ్చువాళ్లకూ బాట ఐనది ...

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా...
అనుకొని కోడి కూత నిదరపోదుగా...
జగతికి మేలుకొలుపు మానుకోదుగా ...
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే...
మబ్బుకొంగు చాటుగా వొదిగి దాగితే...
వాన ధార రాదుగా నేల దారికి...
ప్రాణమంటూ లేదుగా బ్రతకటానికి ...

చెదరక పోదుగా చిక్కని చీకటి...
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి...
దానికి లెక్క లేదు కాళరాతిరీ...
పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతిని...
రెప్ప వెనక ఆపనీ కంటి నీటిని...
సాగలేక ఆగితే దారి తరుగునా?...
జాలి చూపి తీరమే దరికి చేరునా...?...

యుగములు సాగినా నింగిని తాకకా...
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా...
ఓటమి ఒప్పుకుంటు  ఆగిపోదుగా...
ఎంత వేడి ఎండకా ఒళ్ళుమండితే...
అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా...
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా..
నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా...