August 31, 2025

నీకిస్త తమ్ముడా

నీకిస్త తమ్ముడా
శ్రీ రాములయ్య (1998)
గాయకుడు: వందేమాతరం శ్రీనివాస్
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గీత రచయిత: శివ సాగర్

విప్పపూల చెడ్డసిగల దాచిన విల్లమ్ములన్ని
నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా
లహర్ జ్వాల దారిలోన దాచిన బల్లెమ్ములన్ని
నీకిస్త తమ్ముడా చల్... నీకిస్త తమ్ముడా

August 23, 2025

బోనాల పండగ

బోనాల పండగ
తెలుగు ర్యాప్ సాంగ్ (2025)
దశగ్రీవ ట్రూప్

ఓ మై గాడ్... 
క్లానీ...
సాంబ్రాణి ఊదు పొగలు 
మా ఫలహారం బండ్లు 
ఆ పెద్ద తొట్టెలు 
డప్పుల సప్పుడు 
కొట్రా కొట్రా 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆడు ఆడు ఆడు ఆడు 
బోనాల పండగ జోరుదార్ 
దుగ్గి లేపి మార్ మార్ 
ఏక్ దో తీన్ మార్
ఆడు ఆడు ఆడు ఆడు 
బోనాల పండగ జోరుదార్ 
ఏక్ దో తీన్ మార్
ఆడు ఆడు ఆడు ఆడు 

నల్ల జీలకర్ర మొగ్గ

చిత్రం: గరివిడి లక్ష్మి ( 2025)
సంగీతం: చరణ్ అర్జున్ 
పాట మూలం: ఉత్తరాంధ్ర జనపదాలు 
అదనపు సాహిత్యం: జానకిరామ్ 
గాయకులు: అనన్య భట్, జానకిరామ్, గౌరీ నాయుడు జమ్ము 

నల్ల జీలకర్ర మొగ్గ 
నా నల్ల జీలకర్ర మొగ్గ
నల్ల జీలకర్ర మొగ్గ 
నా నల్ల జీలకర్ర మొగ్గ
రూపాయ్ కావాలా
రూపాయ్ పువ్వులు కావాలా ?
రూపాయ్ కావాలా
రూపాయ్ పువ్వులు కావాలా ?

నా రూపు రేఖ సల్లగుంటే..
అ.. ఎలగా ?
మావా.. నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయ్ ఎందుకు
రూపాయ్ పువ్వులెందుకు

ఆహా !
నా రూపు రేఖ సల్లగుంటే
రూపాయ్ ఎందుకు
రూపాయ్ పువ్వులెందుకు
అవును

నల్ల జీలకర్ర మొగ్గ...

August 4, 2025

కాపోళ్ల ఇంటికాడ


తెలంగాణా జానపదం 
సాహిత్యం: శ్రీలతా యాదవ్
గాయని: భానుశ్రీ 
సంగీతం: మదీన్ ఎస్కె 

కాపోళ్ల ఇంటికాడ కామూడాటలట
పడుసోళ్లంత వచ్చి ఆడుకుంటరట
ఆడబోదమా బావ సూడబోదమా
మనం ఆడబోదమా బావ సూడబోదమా

August 2, 2025

నా పేరే ఎల్లమ్మ

తెలంగాణా అమ్మవారి పాట 
డీజీ లింగా
సాహిత్యం: రాజేందర్ కొండా 
గాయని: ప్రభ 
సంగీతం: మదీన్ ఎస్కె 

నా పేరే ఎల్లమ్మ 
నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా 
నన్ను జోలాజోలంటి…
ఆరుగంపల్లా 
నేను ఆడినదాన్నమ్మో …
అందరి ముంగట 
నేను అమ్మవారునే…
కలియుగములోన 
కన్నెమాతానంటిరే…
ఎయ్యో యాపశెట్టంటి 
నాకు ఇంపుగాయెనే…
నా పేరే ఎల్లమ్మ 
నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా 
నన్ను జోలాజోలంటి…