చిత్రం: ఎర్ర మల్లెలు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ధవళ సత్యం
గానం: బాలు, శైలజ, రమేశ్, ఆనంద్
పల్లవి:
బంగారూ మా తల్లీ
బూవీ (భూమి) మా లచ్చిమి
బాగ్యాలు (భాగ్యాలు) పండాలా
బూవీ మా లచ్చిమి
దేవుడి సొరగం మాకొద్దూ
దేవుడి సొరగం మాకొద్దూ
నీ నవ్వుల పంటలు మాకివ్వు
చరణం 1:
రాయీ రప్పా పిండిగ సేసి
మెరకా పల్లం సదునుగ సేసి
మా రకతాన్నే నీరుగ పోసి
మా పానాల్నే నాటుగ వేసి
వొళ్ళొంచి వొంగామమ్మా
వొళ్ళొంచి వొంగామమ్మా
నీ ఒడిలోనే పెరిగామమ్మా
చరణం 2:
ఒకే పేగునా పుట్టినవాళ్ళం
ఒకే మాటగా బతికేవాళ్ళం
ఒకే పేగునా పుట్టినవాళ్ళం
ఒకే మాటగా బతికేవాళ్ళం
అన్నకి నేనూ అండగ ఉంటా
తమ్ముడికీ నే తోడుగ ఉంటా
కష్టాన్నే నమ్మామమ్మా
కష్టాన్నే నమ్మామమ్మా
మా కళ్ళకు నీళ్ళు రానీబోకమ్మా
చరణం 3:
కష్టపడేటి రైతుల సూసి
నెలతల్లికీ కన్నుల పండుగ
కలతలు లేని కొడుకుల సూసీ
కన్నతల్లికీ రోజూ పండుగ
ఇట్టాగే మము సూడమ్మా
ఇది మించీ కోరము నిన్నమ్మా
చరణం 4:
నడిమికి నిన్నూ పీలిక సేసి
కన్నతల్లి కడుపును కోసి
తన్నులాడిన బిడ్డలతల్లినీ
నన్ను సూసీ నవ్వకమ్మా
ఎన్నటికైనా మేమందరం
కలిసుండేలా దీవించమ్మా