May 5, 2024

దిం దింతార

చిత్రం : ఓ చినదానా (2002)
రచన : సిరివెన్నెల
సంగీతం : విద్యాసాగర్
గానం: బాలు, ఉమా రమణన్

పల్లవి:

చెయ్యి గిల్లి చేసుకున్న  
చిననాటి బాసలు
మరిచిపోతనా మరిచిపోతనా

దండలల్లి దాచుకున్న 
ఆ చిన్ని ఊసులు
మరిచిపోతనా మరిచిపోతనా

తాయిలాలు పంచుకున్న 
ఆ తీపి రోజులు
మరిచిపోతనా మరిచిపోతనా 

గండుపిల్లి  గిచ్చినట్టు 
నీ గోటి గుర్తులు
మరిచిపోతనా మరిచిపోతనా  

          
చరణం 1:

నాతో కలవాలని నువ్వు 
కావాలని ఫెయిలయ్యావు
మరిచిపోతనా మరిచిపోతనా.....
ఊ...

ఆ సంగతి తెలిసిన నువ్వు 
పాపం తెగ ఫీలయ్యావు
మరిచిపోతనా మరిచిపోతనా...
ఊ...

ఊరించి నను  కాసేపు 
ఊరే వదిలిపోయావు

ఆనాటి నీ తడిచూపు 
నను లాగిందిలే నీవైపు

ఆ చెమ్మ చెలిమి ఏజన్మకైనా 
మరిచిపోతనా మరిచిపోతనా             

చరణం 2:

నీకో బొమ్మని కొన్నాను 
ఇంట్లో తన్నులు తిన్నాను
మరిచిపోతనా మరిచిపోతనా

అంతా దొంగాడని నిన్ను 
తిడుతూంటే నేవిన్నాను
మరిచిపోతనా  మరిచిపోతనా 

నీకుండేది పువ్వుల గౌను 
అది చూపించవా చూస్తాను

నీ కోసమిప్పుడు నేను 
ఆ గౌనేసుకుని రాలేను

ఆనాటి చెలిమి 
ఏనాటికైనా
మరిచిపోతనా మరిచిపోతనా....