May 8, 2024

మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ

చిత్రం: పరదేశి (1998)
రచన: చంద్రబోస్ 
సంగీతం: కీరవాణి
గానం: బాలు, చిత్ర 

పల్లవి: 

మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ 
పూసింది మధువనం
మధువనం మధువనం 
మధువనం మధువనం

తల్లో మెల్లో ఒళ్ళో జల్లో తుళ్ళి తుళ్ళి 
ఆడింది పరవశం
పరవశం పరవశం ప్రతిక్షణం పరవశం

ఆషాడాలు అంతమై మూఢాలన్నీ మాయమై 
మళ్ళీ మళ్ళీ మళ్ళీ
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ 
పూసింది మధువనం
మధువనం మధువనం 
మధువనం మధువనం

చరణం 1:

నైరుతి ఋతుపవనం 
మన కౌగిలి కొచ్చి వెచ్చగా మారింది 

పున్నమి శశికిరణం మన వరసే మెచ్చి 
హారతులిచ్చింది

చిలుకా గువ్వా చెబుతున్నాయి శకునాలు

మెరుపూ మబ్బూ జరిపించాయి తిరునాళ్ళు

విరహాలు వేయి మైళ్ళు జరజర జరజర
జరజర జరజర పారిపోగా

చరణం 2:

కన్యారాశి ఫలం 
మన అల్లరి ఆటకు అనుకూలించింది

తారా చంద్ర బలం 
మన తోడే ఉంటూ తొందర పడమంది

నెమలీ హంసా పరిచేశాయి దైతాలు

నిమ్మా పనసా అందించాయి తలదిళ్ళు 

సరసాల సల్లాపాలు చకచక చకచక 
చకచక చకచక సాగిపోగా