May 5, 2024

ఓ లగిజిగి

చిత్రం: ఎర్ర మల్లెలు (1981)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: ధవళ సత్యం
గానం: యస్.పి. బాలు

పల్లవి: 

ఓ లగిజిగి జిగిలగి జిగిలగి లగిజిగి 
లంబాడీ లబ్జనక జనకరీ... 
తకిట తకిట తక తాళం వేస్తూ 
తిరగబడర అన్నా 
ఓహో తిరగబడర అన్నా
నువ్వూ తిరగబడర అన్నా
ఆహా తిరగబడర అన్నా

చరణం 1:

ఎండనకా వాననకా 
రేయనకా పగలనకా 
పొలము పుట్రాయెంటా పన్జేసే కూలన్నా 
ఓ రైతు కూలన్నా
కష్టానికి ఫలితంగా కన్నీళ్ళే మిగిలేను

చరణం 2:

గుంటనక్క మాటలు నమ్మీ 
నేలతల్లి నొదిలావా...! 
కామందుల నీడన ఒదిగీ 
పాలేరుగ మారావా? 
కన్నీటి ఓ చిన్నా 
ఎన్నాళ్ళు నీకోసం 
నీ తల్లికి కన్నీళ్ళు 

చరణం 3:

బానిసగా నీ బతుకూ 
బండబారి పోవాలా..!
బాధలతో గుండెబలం 
దండగై పోవాలా?
అన్నా ఓ చిన్నన్నా 
ఈ తీరు ఎన్నాళ్ళు? 
ఇకనైనా కళ్ళు తెరువ్...