May 4, 2020

దండాలు సామీ


దండాలు సామీ
ప్రయివేటు సాంగ్ 
వేంకటేశ్వరస్వామి మీద 
జానకి (ముసలి ఆవిడ, చిన్నపిల్ల, మధ్య వయసు ఆడ, మగ గొంతులతో మిమిక్రీ)
సునీతగారి గొంతు కూడా ఇందులో వినవచ్చు.

దండాలు సామీ 
దండాలు సామీ
దండాలు సామీ
దండాలు సామీ
దండాలు సామీ దండాలు
దండిగ తెచ్చాము దండలు పూలదండలు 
దండాలు సామీ దండాలు
దండిగ తెచ్చాము దండలు పూలదండలు 
సామీ
ఎవ్వరికుంటాది నీ గొప్ప మనసు 
ఎవ్వరికి అది తెలవని దినుసు 
ఎవ్వరికుంటాది నీ గొప్ప మనసు 
ఎవ్వరికి అది తెలవని దినుసు 
దండాలు సామీ దండాలు
దండిగ తెచ్చాము దండలు పూలదండలు 
దండాలు సామీ దండాలు
దండిగ తెచ్చాము దండలు పూలదండలు
అందుకో సామీ

ఎతికేరు నిన్ను సదువుకున్నోళ్ళు 
ఇక తిరిగిరారు నిను చూసినోళ్ళు 
ఎతికేరు నిన్ను సదువుకున్నోళ్ళు 
ఇక తిరిగిరారు నిను చూసినోళ్ళు
సదువంటే ఏంటో ఎరుకే లేనోళ్ళం
సదువంటే ఏంటో ఎరుకే లేనోళ్ళు 
సల్లంగ సూడయ్య నమ్ముకున్నోళ్ళం 
సల్లంగ సూడయ్య నమ్ముకున్నోళ్ళం 
సల్లంగ సూడయ్య నమ్ముకున్నోళ్ళం 
దండాలు సామీ దండాలు
దండిగ తెచ్చాము దండలు పూలదండలు 
దండాలు సామీ దండాలు
దండిగ తెచ్చాము దండలు పూలదండలు
అందుకో సామీ

తిరుమలలో నువ్వు ఎలిసావంట
ఏడుకొండలపై నిలిసావంట
సామీ శీనివాసమూర్తి 
తిరుమలలో నువ్వు ఎలిసావంట
కష్టాలన్నీ తీర్చేవంట 
మా కష్టాలన్నీ నువ్వు తీర్చేవంట 
కాళ్ళట్టుకుంటే కరుణించేవంట 
వరమిచ్చేవంట 
ఆ...సామీ సామీ వెంకన్నసామీ
గోవిందా 
కాళ్ళట్టుకుంటే కరుణించేవంట 
వరమిచ్చేవంట 
సామీ గోవిందా 
కాళ్ళట్టుకుంటే కరుణించేవంట 
వరమిచ్చేవంట 
కంటికి రెప్పగ కాపాడేవంట కాపాడేవంట
కంటికి రెప్పగ కాపాడేవంట కాపాడేవంట
దండాలు సామీ దండాలు
దండిగ తెచ్చాము దండలు పూలదండలు 
దండాలు సామీ దండాలు
దండిగ తెచ్చాము దండలు పూలదండలు 
దండాలు సామీ దండాలు
దండిగ తెచ్చాము దండలు పూలదండలు 
దండాలు సామీ దండాలు
దండాలు సామీ దండాలు
దండాలు సామీ దండాలు
దండాలు సామీ దండాలు