గిరగిరగిర
డియర్ కామ్రేడ్ (2019)
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
రచన: రెహమాన్ (రచయిత)
గానం: గౌతమ్ భరద్వాజ్, యామిని ఘంటసాల
గిర గిర గిర తిరగలి లాగా తిరిగి అరిగిపోయినా
దినుసే నలగలేదులే...
(హొయ్ హొయ్ హొయ్ హొయ్)
అలుపెరగక తనవెనకాలే అలసి సొలసి పోయినా
మనసే కరగలేదులే...
(హొయ్ హొయ్ హొయ్ హొయ్)
చినదేమో తిరిగే చూడదే...
ప్రేమంటే అసలే పడదే (హోయ్)
గిర గిర గిర తిరగలి లాగా తిరిగి అరిగిపోయినా
దినుసే నలగలేదులే...
(హొయ్ హొయ్ హొయ్ హొయ్)
అలుపెరగక తనవెనకాలే అలసి సొలసి పోయినా
మనసే కరగలేదులే...
చరణం 1:
అలలు అలిసి చతికిలపడునా
కలలు నిలిచి కలవరపడునా
సహజగుణము నిమిషము విడునా
ఏమి జరిగినా...
మనసునెపుడు వదలని తపన
వినదు అసలు ఎవరేమనినా
గగనమొరిగి తనపై పడినా
ఆశ కరుగునా...
వే...సవి లోన పెనుతాపం ఓ ఆరాటంలా
నింగిని తాకి దిగి రాదా వర్షంలా
గిర గిర గిర తిరగలి లాగా తిరిగి అరిగిపోయినా
దినుసే నలగలేదులే...
సన్నాయి డోలు పెళ్లిపాట పాడే
అబ్బాయి ఓరకంట చూస్తున్నాడే
బంగారు బొమ్మ తల ఎత్తి చూడే
నీ ఈడు జోడే అందాల చందూరూడే
చరణం 2:
ఎవరికెవరు తెలియదు మునుపు
అడిగి అడిగి కలగదు వలపు
ఒకరికొకరు అని కలపనిదే
మనని వదులునా...
ఎదురుపడిన క్షణమొక మలుపు
అడుగు కలిపి కదిలితే గెలుపు
దిశలు రెండు వేరై ఉన్నా
పయనమాగునా...
నేనంటే తానే తను నేనే ఒకటై ఉన్నానే
పొమ్మన్నా పోనే పడతానే లేస్తానే
గిర గిర గిర తిరగలి లాగా తిరిగి అరిగిపోయినా
దినుసే నలగలేదులే...
(హొయ్ హొయ్ హొయ్ హొయ్)
అలుపెరగక తనవెనకాలే అలసి సొలసి పోయినా
మనసే కరగలేదులే...
(హొయ్ హొయ్ హొయ్ హొయ్)