May 1, 2020

కోకిల కోకిల కూ అన్నది


కోకిల కోకిల కూ అన్నది
చిత్రం : పెళ్ళి చేసుకుందాం (1997)
రచన : సాయి శ్రీహర్ష
సంగీతం : కోటి
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర

పల్లవి :

కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ అన్నది
దేవత నీవని మమతలకోవెల
తలపు తెరిచి ఉంచాను
ప్రియా ప్రియా... జయీభవ కౌగిళ్లలో
సఖీ సఖీ... సుఖీభవా సందిళ్లలో
కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ యన్నది
చరణం : 1

గుండెగూటిలో నిండిపోవా
ప్రేమగువ్వ లాగ ఉండిపోవా
ఏడు అడుగుల తోడు రావా
జన్మజన్మలందు నీడ కావా
లోకం మన లోగిలిగా
కాలం మన కౌగిలిగా
వలపే శుభదీవెనగా
బ్రతుకే ప్రియ భావనగా
ఆ ఆకాశాలే అందేవేళ ఆశలు తీరెనుగా

చరణం : 2

వాలుకళ్లతో వీలునామా
వీలు చూసి ఇవ్వు చాలు భామా
వేళపాళలు ఏలనమ్మా
వీలులేనిదంటులేదులేమ్మా
మనమేలే ప్రేమికులం
మనదేలే ప్రేమ కులం
కాలాన్నే ఆపగలం
మన ప్రేమను చూపగలం
కలలన్నీ తీరే కమ్మని క్షణమే
కన్నుల ముందుందమ్మా

కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓ అన్నది
దేవత నీవని మమతలకోవెల
తలపు తెరిచి ఉంచాను
ప్రియా ప్రియా... జయీభవ కౌగిళ్లలో
సఖీ సఖీ... సుఖీభవా సందిళ్లలో