May 1, 2020

ఓ ముత్యాల రెమ్మా


ఓ ముత్యాల రెమ్మ
ఒసేయ్ రాములమ్మా (1997)
వందేమాతరం శ్రీనివాస్
స్వర్ణలత, వందేమాతరం శ్రీనివాస్
సుద్దాల అశోక్ తేజ

ఓ ముత్యాల రెమ్మ
ఓ మురిపాల కొమ్మ
ఓ పున్నామి బొమ్మ
ఓ పుత్తడి గుమ్మ
ఓ రాములమ్మా.... రాములమ్మాఏం చూపులోయమ్మ
ఏగుచుక్కలే నమ్మ
సిరినవ్వులో యమ్మ
చంద్రవంక లేనమ్మ
ఓ రాములమ్మా.... రాములమ్మా

నువ్వు కడవ మీద కడవ బెట్టి కదిలితేనమ్మ
ఓ ఒసేయ్ రాములమ్మా
ఆ కరిమబ్బు వరిదుబ్బు కన్ను కలిపెనమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
నువ్వు సిందు మీద సిందేసి సెంగుమంటే నమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా

పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటె
నురగ తీరుగా ఉన్నావే
ఓ రాములమ్మ
విచ్చుకోని మొగ్గవోలె పచ్చిపాల నిగ్గువోలె
ముచ్చటేసి పోతున్నావే
ఓ రాములమ్మ
వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో
వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో
నువ్వు పచ్చంగుండాలే
నువ్వు పదిలంగుండాలే
భూమితల్లి సాక్షిగ నువ్వు క్షేమంగుండాలే
సూరీడే నీ వంక తేరి చూసేనమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
అడుగేస్తే నేలంతా అద్దమాయెనమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా

చరణం 1:

పసిడి వన్నె ఒంటి మీద పాడు చూపు పడకుండా
పసుపు పూసినారే అమ్మలు
ఓ రాములమ్మ
చిట్టి వయసు పారిపోయే సిగురు వయసు చేరెనని
చీర కట్టినారే గుమ్మలో
ఓ రాములమ్మ
దొరగారి దొరసాని దీవెనలా కోసమని
ఆ దొరగారి దొరసాని నిండు దీవెనల కోసమని
కాళ్ళు మొక్తా బాంచనని వంగినావమ్మా
మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా
దొరగారి పై ఊగే పంకా వైనావమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
దొరసాని కాళ్ళొత్తే దూదివైనావమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
దేవిడినే వెలిగించే దివ్వెవైనావమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
నలుగురికి తల్లోని నాల్కవైనావమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా

చరణం 2:

చీకటింట బిక్కుమంటు కలతపడ్డ కళ్ళల్లోన
బాకులాంటి ఎలుగు మెరిసెనా
ఓ రాములమ్మ
మూగబడ్డ వెదురులోన ముచ్చటైన రాగాలూదే
ముద్దులయ్య చెయ్యి దొరికేనా
ఓ రాములమ్మ
కష్టాలూ కన్నీళ్లు ఉంటాయా చానాళ్ళు
కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా చానాళ్ళు
ఇంకా పొదలమాటు పువ్వుల్లాగ ఒదగాలోయమ్మ
గుబులే లేని గువ్వల్లాగా ఎగరాలోయమ్మ
పచ్చని అడవితల్లి పందిరవుతుందమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
నీరెండే నీ కాలి పారాణవుతుందమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
పూసేటి పూలన్ని పోసే తలంబ్రాలమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
కోయిలలా సందడ్లే సన్నాయిమేళాలమ్మ
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా
ఓ ఓ ఒసేయ్ రాములమ్మా