నీ వయస్సులో ఉషస్సుకే

చిత్రం: బలరామకృష్ణులు (1992)
సంగీతం: రాజ్-కోటి
గీతరచయిత: వేటూరి 
నేపథ్యగానం: బాలు, చిత్ర 

పల్లవి: 

నీ వయస్సులో ఉషస్సుకే 
నమస్సుమాంజలి
నీ మనస్సులో తపస్సుకే 
శిరస్సు వంచనీ

నీ వయస్సులో ఉషస్సుకే 
నమస్సుమాంజలి

నీ మనస్సులో తపస్సుకే 
శిరస్సు వంచనీ

లాలిజో స్వరాలలో
వినీలమేఘమాల నీడలో
ప్రాణవేణు ఊదుకున్న
నీ వయస్సులో ఉషస్సుకే 
నమస్సుమాంజలీ

నీ మనస్సులో తపస్సుకే 
శిరస్సు వంచనీ

చరణం 1:

వయసుకు చలివో 
ప్రియచెలివో 
తెలియదుగానీ 
చిలకల కొలికి 
మనసిపుడు తెలుపవే

వలపుల వలవో 
ఒక కలవో 
ఎరుగను గానీ
కనులను వెలిగే 
కథలిపుడు తెలిసెలే

నీ లయా ఎదకేలయా
నీ దయా చెలి నీదయా

కోకిలమ్మ పెళ్ళివిందు 
కొమ్మలన్ని కోరుకున్న
నీ వయస్సులో....

చరణం 2:

ఒకరికి ఒకరై 
శృతి ఒకటై 
బ్రతుకొక పాటై
పలికిన జతకి  
తొలిపలుకు వలపులే

మనసున మనసై 
ఒక మనిషై 
మరువని తోడై
నడిచిన కథలో 
అడుగడుగు మమతలే

మల్లెలా విరుజల్లులా 

వెల్లువో హరివిల్లువో

మోజులమ్మ రోజుకొక్క 
మేజువాణి చేసుకున్న

నీ వయస్సులో...

No comments:

Post a Comment

Leave your comments