ఇదేలే తరతరాల చరితం

చిత్రం: పెద్దరికం (1992)
సంగీతం: రాజ్-కోటి
గీతరచయిత: భువనచంద్ర
నేపథ్యగానం: ఏసుదాస్

పల్లవి : 

ఇదేలే తరతరాల చరితం... 
జ్వలించే జీవితాల కథనం
ఇదేలే తరతరాల చరితం... 
జ్వలించే జీవితాల కథనం 

పగేమో ప్రాణమయ్యేనా... 
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా... 
ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం... 
జ్వలించే జీవితాల కథనం

చరణం 1 :

ఒడిలో పెరిగిన చిన్నారినే 
ఎరగా చేసినదా ద్వేషము
కథ మారదా...  
ఈ బలి ఆగదా 

మనిషే పశువుగా మారితే 
కసిగా శిశువుని కుమ్మితే
మనిషే పశువుగా మారితే 
కసిగా శిశువుని కుమ్మితే

అభమూ శుభమూ ఎరుగని 
వలపులు ఓడిపోయేనా 

ఇదేలే తరతరాల చరితం... 

చరణం 2 :

విరిసీవిరియని పూదోటలో 
రగిలే మంటలు చల్లారవా
అర్పేదెలా... 
ఓదార్చేదెలా

నీరే నిప్పుగ మారితే 
వెలుగే చీకటి రువ్వితే
నీరే నిప్పుగ మారితే 
వెలుగే చీకటి రువ్వితే

పొగలో సెగలో మమతల 
పూవులు కాలిపోయేనా 

ఇదేలే తరతరాల చరితం... 

No comments:

Post a Comment

Leave your comments