ఎవరో ఎవరో ఎవరో

నవ మోహిని (1984)
గానం: సుశీల 
సంగీతం: పార్థసారథి
రచన: జి. కె. మూర్తి

పల్లవి : 

ఎవరో ఎవరో ఎవరో 
నను చేరేవారెవరో 
ఎవరో ఎవరో ఎవరో 
ఎవరో ఎవరో ఎవరో
నను చేరేవారెవరో 
ఎవరో ఎవరో ఎవరో 

చరణం 1:

కన్నీటి వరదలోనా 
కలలన్ని కరిగిపోయే 
కన్నీటి వరదలోనా 
కలలన్ని కరిగిపోయే 
నిరుపేద కన్నెమనసే 
శిలలాగ మిగిలిపోయే 

విషనాగు పొంచి పొంచి 
కసితీర కాటువేసే 
విషనాగు పొంచి పొంచీ 
కసితీర కాటువేసే
నూరేళ్ళ నిండుబ్రతుకే 
సుడిగాలి లోన కలిసే 

ఎవరో ఎవరో ఎవరో

చరణం 2:

ఈగుండెలోని జ్వాల 
ఏనాడు ఆరిపోదు 
ఈగుండెలోని జ్వాలా 
ఏనాడు ఆరిపోదు 
గగనాలు విరిగిపడినా 
పగతీర్చుకొందు నేను 

తెగిపోని చివరి ఆశ 
రగిలించె రక్తఘోష 
తెగిపోని చివరి ఆశ 
రగిలించె రక్తఘోష

నా పిలుపు మృత్యుశంఖం
ఇది తిరుగులేని పంతం 

ఎవరో ఎవరో ఎవరో

No comments:

Post a Comment

Leave your comments