చిత్రం: సింధు భైరవి (1985)
గానం: కె.ఎస్. చిత్ర
సంగీతం: ఇళయరాజా
రచన: రాజశ్రీ
పల్లవి :
పాడలేను పల్లవైన భాష రాని దానను
వేయలేను తాళమైన లయనేనెరుగను
తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా
తోచిన మాటలనే వరుస కట్టి అంటున్నా...
||పాడలేను||
చరణం 1:
అమ్మజోల పాటలోన రాగమెంత ఉన్నది?
పంటచేల పాటలోన భాష ఎంత ఉన్నది?
ఊయలే రాగం పైరగాలి మేళం
మమతే రాగం శ్రమజీవనమే భావం
రాగమే లోకమంతా
కష్టసుఖములే స్వరములంటా
షడ్జమకోకిల గానస్రవంతికి
పొద్దుపొడుపే సంగతంటా
||పాడలేను||
చరణం 2:
రాగానిదేముంది
రసికులు మన్నిస్తే
తెలిసిన భాషలోనే
తీయగా వినిపిస్తే
ఏ పాటైనా ఎద పొంగిపోదా
ఏ ప్రాణమైనా తమి తీరిపోదా
చెప్పేది తప్పోఒప్పో
చెప్పేది తప్పోఒప్పో
రహస్యమేముంది విప్పిచెబితే
ఆహూ... ఊహూ... రోకటిపాటలో
లేదా మధురసంగీతం
ఆహూ... ఊహూ... రోకటిపాటలో
లేదా మధురసంగీతం
||పాడలేను||
No comments:
Post a Comment
Leave your comments