సింధు భైరవి (1985)
త్యాగరాజ స్వామి కృతి
ఇళయరాజా
ఏసుదాస్
పల్లవి:
మరి మరి నిన్నే మొఱలిడ
మరి మరి నిన్నే మొఱలిడ
మరి మరి నిన్నే మొఱలిడ
నీ మనసున దయరాదు
మరి మరి నిన్నే మొఱలిడ
నీ మనసున దయరాదు
మరి మరి నిన్నే
అనుపల్లవి:
కరి మొఱ విని సరగున సన నీకు
కారణమేమి సర్వాంతర్యామి
మరి మరి నిన్నే మొఱలిడ
నీ మనసున దయరాదు
చరణం:
కరుణతో ధ్రువుని ఎదుట నిలిచిన కథ విన్నానయ్య
సురరిపు తనయునికై నరమృగమౌ సూచనలేమయ్యా
మరచియున్న వనచరుని బ్రోచిన మహిమ తెలుపవయ్యా
ధరను వెలయు త్యాగరాజ సన్నుత తరముగాదిక నే విననయ్య
No comments:
Post a Comment
Leave your comments