చిత్రం: పరదేశి (1998)
రచన: చంద్రబోస్
సంగీతం: కీరవాణి
గానం: ఉన్ని కృష్ణన్, చిత్ర
పల్లవి:
తెలుగు ఇంటి పెరటిలోన విరిసే మందారమా
చిగురుమావి గుబురులోని కుహుకుహూల రాగమా
ఐ యామ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్
దట్ ఐ యామ్ ఫాలింగ్ ఇన్ లవ్
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
ఐ వాంట్ టు లివ్
ఈ ఊరి గాలి మంచికబురు తెచ్చింది
కోరుకోని కాలమేమో కలిసొచ్చింది
నయగారా దారుల్లో ఉరికే జలపాతమా
న్యూజెర్సీ తోటల్లో అల్లుకున్న శాంతమా
ఐ యామ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్
దట్ ఐ యామ్ ఫాలింగ్ ఇన్ లవ్
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
ఐ వాంట్ టు లివ్
ఈ చిన్నిమాట నాకు భలే నచ్చింది
ఇంత వరకు లేని హాయి తెలిసొచ్చింది