April 9, 2021

ఇదిగో ఇపుడే ఎరిగిన ప్రేమో



ఇదిగో ఇపుడే ఎరిగిన ప్రేమో
అప్పుడప్పుడు (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ 
రచన: చైతన్య ప్రసాద్

ఇదిగో ఇపుడే ఎరిగిన ప్రేమో 
నాలో నీలా పెరిగినదేమో 
ప్రాణమా... చేరవా
మౌనమే... మానుమా

చెంతవున్న వేళలో 
అంత పంతమా 
దూరమైన దారిలో 
వింత బంధమా 

సొంతమైన వేళలో 
అంత తేలికా 
దొరకవన్న వేళలో
ఇంత కోరికా 

చరణం 1:

కలలే అలలై 
అలజడి రేపే 
వలపే వగపై 
ఎద సడి ఆపే 
ప్రేమలే నేరమా 
వీడెనా నేస్తమా 

కలిసి ఉన్న కాలమే 
తెలియలేదిదీ 
తెలుసుకున్న సంగతే 
తెలుపలేనిదీ 

రేపు లేని చూపులో 
నీటి కన్నిదీ 
నాకు నేను లేనుగా 
నీవు లేనిదే 

చరణం 2:

ఇదిగో ఇపుడే ఎరిగిన ప్రేమో 
నాలో నీలా పెరిగినదేమో 
ప్రాణమా... చేరవా
మౌనమే... మానుమా

నేను నేను కానుగా 
నీవు లేనిదే 

ఆకురాలుకాలమే; 
వీడుకోలిదే 

గురుతులెన్నో చేసెలే 
గుండె చప్పుడూ 

ఊసుపోని చేతులే 
అప్పుడప్పుడూ....