నీ కలలు కావాలి



నీ కలలు కావాలి 
అప్పుడప్పుడు (2003)
సంగీతం: ఆర్.పి.పట్నాయక్ 
రచన: చైతన్య ప్రసాద్

పల్లవి: 

నీ కలలు కావాలి 

ఇలా కలిసిపోవాలి 

లోలోనే నువ్వుంటే

ఏదో హాయిగా 

నీ కలలు కావాలి 

ఇలా కలిసిపోవాలి 

చరణం 1:

చూపులేఖలు వ్రాసి 
కనుపాప సైగలు చేసి 
రాయబారం నే పంపనీ 

కోరచూపులు నీవా 
చిరు కోరికుంటే రావా 
కొత్తగా నేననిపించనీ 

ఈ పులకింతలో 
ఈ గిలిగింతలో 
చెయ్యాలింక ఏకాంతసేవా 

నిను మురిపించనీ 
మైమరిపించనీ   
ఆ అలవాటు నేర్పించవా 

చరణం 2:

తీపి కూడా చేదే 
ఇక నిదర కూడా రాదే 

వలపుకే అది ఫలితం కదా 

వేడి ఊపిరే తడితే 
తుదిలేని ఆశలే పుడితే   

ప్రేమలో ఇది సహజం పదా 

ఎదే రసరథం 
రతీమన్మథం 

ప్రతీమాట సమ్మోహనాస్త్రం 
నీ ఆవేశమే నా సందేశమై 

రచించాలి నవశాస్త్రమే 

No comments:

Post a Comment

Leave your comments