ఆకాశవీధిలో
కంచుకవచం (1985)
కృష్ణ-చక్ర
వేటూరి
బాలు, వాణీజయరాం
పల్లవి:
ఆకాశవీధిలో
తళుకుబెళుకు
కులుకులొలుకు తార
ఈ సందె చీకటి
చీరందుకోవే
ఈ జాజివెన్నెల
పూలందుకోవే
మనసు తెలుసుకోవే
ఆ...ఆ...ఆ...
వయసు బతకనీవే
ఓ...హో...హో...
వలపు చిలక రావే...
ఆహాహా...
ఆకాశవీధిలో
చిలిపి వలపు
చిలుకు చందమామ
మునిమాపు వేళకు
ముద్దిచ్చిపోరా
మరుమల్లె పూవుల
మనసందుకోరా
చేయి కలుపుకోరా
ఆ...ఆ...ఆ...
చెలిమి నిలుపుకోరా
ఓ...హో...హో...
చరణం 1:
నీ వయ్యారాలన్ని వసంతాలాడి
కౌగిలి చేరాగానే
నా మనోభావాల
సుగంధాలన్ని అల్లుకుపోయినవీ
నీ సరాగాలన్ని సుఖాలాపాల
వీణలు మీటగనే
ఆ స్వరానందాల సుమించే ప్రేమ
ఝల్లున పొంగినది
నీలోన వర్ణాలు పలికే
సంధ్యారాగము
నాలోన దీపాలు వెలిగే
సాయంకాలము
గులాబీ పూల గులామే చల్లె నీ అందము.
చరణం 2:
ఈ కుహూ గానాల కులాసాలన్ని
గూటికి చేరగనే
నీ విలాసాలన్ని వరించేవేళ
వెచ్చగ సోకినవీ
ఈ సుమించే పూల రమించే గాలి
ఝుమ్మని పాడగనే
నీ హసించే మోము స్పృశించే వేళ
తుమ్మెద లాడినవీ
ఆరారు కాలాలు కరిగే
శిల్పానందము
నూరేళ్ళ బంధాల కెదిగే
నేత్రానందము
సౌందర్యాలు సలామే చేసే
నీ కోసము