June 21, 2020

కన్నెపిల్ల మూడుముళ్ళతో

కన్నెపిల్ల మూడుముళ్ళతో
చిత్రం : విజయ (1979) 
గానం: వాణి జయరాం 
రచన: ఉత్పల 
సంగీతం: చక్రవర్తి 

పల్లవి: 

కన్నెపిల్లా... మూడుముళ్ళతో 
కావ్యనాయికైనదండి నేటి నుండీ.. 
నేటి నుండీ అమ్మమ్మా... ఏవమ్మా... 
అమ్మమ్మా... ఏవమ్మా... 
కన్నెపిల్లా... మూడుముళ్ళతో 
కావ్యనాయికైనదండి నేటి నుండీ.. 
నేటి నుండీ 

అనుపల్లవి: 

మిథిలాపురి వదిలిపెట్టి 
అయోధ్యకు చేరుకుంటే... 
మిథిలాపురి వదిలిపెట్టి 
అయోధ్యకు చేరుకుంటే... 
మేము గుర్తు ఉంటామా అమ్మమ్మా... 
మేము గుర్తు ఉంటామా 
అమ్మమ్మా... ఏవమ్మా... 

కన్నెపిల్లా మూడుముళ్ళతో
కావ్యనాయికైనదండి నేటి నుండీ.. 
నేటి నుండీ 

చరణం 1: 

సిగలోని పూవులూ వాడనీయకూ 
సింధూర రేఖను చెదరనీయకూ 
కాలి పారాణి మాయనీయకమ్మా 
కాలి పాపారాణి మాయనీయకమ్మ 
మన వంశగౌరవం మరచిపోకమ్మ 
మన వంశగౌరవం మరచిపోకమ్మ 
అమ్మమ్మా...ఏవమ్మా... 
అమ్మమ్మా...ఏవమ్మా... 

కన్నెపిల్లా మూడుముళ్ళతో 
కావ్యనాయికైనదండి నేటి నుండీ.. 
నేటి నుండీ... 

చరణం 2: 

బంగారులేడినీ అడగొద్దు 
పతిసేవ ఎన్నడూ మరవొద్దు 
మంచి ముత్తైదు అనిపించుకోవమ్మ 
మంచి ముత్తైదు అనిపించుకోవమ్మ 
శేషాద్రివాసుడు శుభములిచ్చేనమ్మా 
శేషాద్రివాసుడు శుభములిచ్చేనమ్మ 
అమ్మమ్మా...ఏవమ్మా... 
అమ్మమ్మా...ఏవమ్మా... 
కన్నెపిల్లా.... మూడుముళ్ళతో 
కావ్యనాయికైనదండి నేటి నుండీ.. 
నేటి నుండీ... 
అమ్మమ్మా...ఏవమ్మ... 
అమ్మమ్మా...ఏవమ్మా...