ర్యాప్ సాంగ్
సంగీతం: విజయ్ బుల్గానిన్
సాహిత్యం: సురేష్ బనిశెట్టి
చక్కనైన చిక్కనైన చుక్కలాంటి కోయిలా
చక్కెరలాంటి ఉక్కెఱలాంటి ముక్కెరలాంటి కోయిలా
చెక్కనైన చెక్కలేని చెక్కిళ్ళున్న కోయిలా
ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోతా కోయిలా
అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు
కంటిమీద నిద్దరేమో వాలదు
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
పొంగుతున్న పిచ్చిప్రేమ ఆగదు
దాచమంటె చిన్నిగుండె చాలదు
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
నువ్వు లేకపోతె దిక్కు తోచదు
చల్లగాలి కూడా ఇటు వీచదు
ఈ మనసిక ఎవ్వరికి ఇవ్వదు
నిన్ను వదిలెక్కడికి వెళ్ళదు
నా ప్రేమ ఏమో ఊహలకి అందదు
నీకు తప్ప ఎవ్వరికి చెందదు
కోయిలా హొయ్ కోయిలా
కోయిలా హొయ్ కోయిలా
చక్కనైన చిక్కనైన చుక్కలాంటి కోయిలా
చక్కెరలాంటి ఉక్కెఱలాంటి ముక్కెరలాంటి కోయిలా
చెక్కనైన చెక్కలేని చెక్కిళ్ళున్న కోయిలా
ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోతా కోయిలా