Showing posts with label సిరిమువ్వల సింహనాదం (1990). Show all posts
Showing posts with label సిరిమువ్వల సింహనాదం (1990). Show all posts

పైరులోని పచ్చదనం


పైరులోని పచ్చదనం
సిరిమువ్వల సింహనాదం (1990)
వేటూరి
మహదేవన్
బాలు

పైరులోని పచ్చదనం..పట్టు చీర కట్టింది
నీరెండల వెచ్చదనం..నుదుట బొట్టు పెట్టింది
పుప్పొడి చెక్కిళ్ళుగా..పుత్తడి తన ఒళ్ళుగా
పున్నమి ఈ కన్నెగా..పుడమిలోన పుట్టింది
అదిగో అదిగదిగో వచ్చిందీ వన్నెల కొమ్మా
మదిలో మధుకథలే చెప్పిందీ వెన్నెల బొమ్మా
పైరులోని పచ్చదనం

చరణం 1:

తూరుపు ఉదయిస్తుంది ఎర్రని పెదవులు వేకువగా
పడమర జోకొడుతుంది ఆ నల్లని కురులే రాతిరిగా
హిమాలయం ఎదురొస్తొంది చల్లని ఆ చిరునవ్వులుగా
సాగరమే పొంగుతుంది ఆ కన్యాకుమారి కులుకులుగా
దిక్కులు నాలుగు ఒక్కటి చేసి
చెక్కిన చక్కెర బొమ్మను చూసి
ఉక్కిరిబిక్కిరి కదా ఎద
అదిగో అదిగదిగో వచ్చిందీ వన్నెల కొమ్మా
మదిలో మధుకథలే చెప్పిందీ వెన్నెల బొమ్మా
పైరులోని పచ్చదనం

చరణం 2:

ఆమని విరబూస్తుంది ఆమెను చూసిన కన్నుల్లో
వేసవి వేధిస్తుంది ఆ చెలి చేరని వెన్నెల్లో
మెరుపుల తొలకరి పుడుతుంది ఆ మెలికలు తిరిగిన వన్నెల్లో
చలిచలి కోరిక చిగురిస్తుంది నెచ్చెలి వెచ్చని సన్నిధిలో
ఋతువులు ఆరు అతివగ మారి..జతకై చేరిన వెతలే తీరి
కంచికి చేరును కదా కథా....ఓ
అదిగో అదిగదిగో వచ్చిందీ వన్నెల కొమ్మా
మదిలో మధుకథలే చెప్పిందీ వెన్నెల బొమ్మా
లా...లా..లలలా
పైరులోని పచ్చదనం