Showing posts with label శతమానం భవతి (2017). Show all posts
Showing posts with label శతమానం భవతి (2017). Show all posts

నిలవదే మది నిలవదే


నిలవదే మది నిలవదే
శతమానంభవతి (2016)
బాలు
రామజోగయ్య శాస్త్రి
మిక్కీ జె మేయర్

నిలవదే మది నిలవదే
శిరి సొగసును చూసి
ఉలకదే మరి పలకదే
తొలివలపున తడిసి

దేవదాసే కాళిదాసై
ఎంత పొగిడిన
కొంత మిగిలిపొయేంత
అందం నీది

అలా నువ్వు చూస్తే చాలు
వెళుతూ వెళుతూ వెనుతిరిగి
అదొ లాంటి తేనల  బాణం
దిగదా ఎదలొకి

నువ్వు నడిచే దారులలొ
పూల గంధాలె ఊపిరిగా
కధ నడిచే మనసు కదే
హాయి రాగల ఆమనిగా
దినమొక రకముగ పెరిగిన సరదా
నినువిడి మనగలదా

ఎలా నీకు అందించాలొ
ఎదలొ కదిలే మధురిమలు
నేనే ప్రేమలేఖగ మారి
ఎదుటే నిలిచాను

చదువుకునే బదులిదని
చెప్పుకొలేవులే మనసా
పదములతొ పనిపడని
మౌనమే ప్రేమ పరిభాషా
తెలుపక తెలిపిన
వలపొక వరమని
కడిలిగ అలలేగసా

మెల్లగా తెల్లారిందోయ్

మెల్లగా తెల్లారిందోయ్
చిత్రం: శతమానం భవతి (2017)
గానం: అనురాగ్‌ కులకర్ణి, రమ్య బెహరా, మోహన భోగరాజు
సంగీతం: మిక్కీ జె.మేయర్‌
రచన: శ్రీమణి

మెల్లగా తెల్లారిందోయ్ అలా
వెలుతురే తెచ్చేసిందోయ్ ఇలా
బోసినవ్వులతో మెరిసే పసిపాపల్లా

చేదతో బావులలో గలా గలా
చెరువులో బాతుల ఈతల కళ
చేదుగా ఉన్నా వేపను నమిలే వేళ
చుట్ట పొగమంచుల్లో
చుట్టాల పిలుపుల్లో
మాటలే కలిపేస్తూ మనసారా
మమతల్ని పండించి
అందించు హృదయంలా

చలిమంటలు ఆరేలా
గుడిగంటలు మోగేలా
సుప్రభాతాలే వినవేలా..ఆఆ..
గువ్వలు వచ్చే వేళ
నవ్వులు తెచ్చే వేళా
స్వాగతాలవిగో కనవేలా..ఆఆ..

పొలమారే పొలమంతా
ఎన్నాళ్లో నువ్వు తలచీ
కళమారే ఊరంతా
ఎన్నేళ్లో నువ్వు విడచి

మొదట అందని దేవుడి గంట
మొదటి బహుమతి పొందిన పాట
తాయిలాలకు తహ తహ లాడిన
పసి తనమే గుర్తొస్తుందా...

ఇంతకన్నా తియ్యనైనా జ్ఞాపకాలే
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయనా..

నువ్వూగిన ఉయ్యాలా..
ఒంటరిగా ఊగాలా
నువ్వెదిగిన ఎత్తే కనపడకా..ఆఆ..
నువ్వాడిన దొంగాట
బెంగల్లే మిగలాలా
తన్నెవరూ వెతికే వీల్లేకా..ఆఅ..

కన్నులకే తియ్యదనం
రుచి చూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం
పలికించే సెలయెళ్లే

పూల చెట్టుకి ఉందో భాష
అలల మెట్టుకి ఉందో భాష
అర్థమవ్వని వాళ్ళే లేరే
అందం మాటాడే భాష

పలకరింపే పులకరింపై
పిలుపునిస్తే పరవశించడమే
మనసుకి తెలిసిన భాష

మమతలు పంచే ఊరు
ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరూ..ఊఊ

ప్రేమలు పుట్టిన ఊరు
అనురాగానికి పేరు
కాదనేవారే లేరెవరూ..ఊఊ