Showing posts with label వంశానికొక్కడు (1996). Show all posts
Showing posts with label వంశానికొక్కడు (1996). Show all posts

ప్రియా మహాశయా

ప్రియా మహాశయా
చిత్రం: వంశానికొక్కడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: బాలు, చిత్ర

ప్రియా మహాశయాలయా చూపవేల దయా
చెలీ మనోహరీ సఖీ మాధురీహృదయా
స్వయంవరా - ప్రియం కదా
మాటేరాని మౌనం హాయిలో

ప్రియా మహాశయాలయా చూపవేల దయా
చెలీ మనోహరీ సఖీ మాధురీహృదయా

తొలి తొలి బులబాటమేదో పులకరిస్తుంటే
అదే కదా కథా
ముఖాముఖి మొగమాటమేదో ములకరిస్తుంటే
ఇదే పొదా పదా
శృతి కలిసే జతై ఇలాగే మైమరిచే క్షణాలలో
ఎద సొదలె కధాకళీలై జతులడిగే జ్వరాలలో
చిలక ముద్దులకు అలకపాన్పులకు
జరిగిన రసమయ సమరంలో

చెలీ మనోహరీ సఖీ మాధురీహృదయా
ప్రియా మహాశయాలయా చూపవేల దయా

మరీ మరీ మనువాడమంటూ మనవి చేస్తుంటే
శుభం ప్రియం జయం
అదా ఇదా తొలి రేయి అంటూ అదుముకొస్తుంటే
అదో రకం సుఖం
చెరిసగమై మనం ఇలాగే పెదవడిగే మజాలలో
రుచిమరిగే మరీ ప్రియంగా కొసరడిగే నిషాలలో
ఒకరి హద్దులను ఒకరు వద్దు అను
సరసపు చలి సరిహద్దులలో
ప్రియా మహాశయాలయా చూపవేల దయా
చెలీ మనోహరీ సఖీ మాధురీహృదయా
స్వయంవరా - ప్రియం కదా
మాటేరాని మౌనం హాయిలో