జీవితంలో గరళాన్ని మింగి
తన గొంతులోని అమృతాన్ని
శ్రోతల చెవుల్లో పోసిన
ఒక పల్లె కోయిల పాట ...
సంగీతం : రఘు కుంచె
సాహిత్యం : లక్ష్మీ భూపాల
గానం. : బేబి పసల
మట్టిమనిషినండి నేను..
మాణిక్యమన్నారు నన్ను
మట్టిమనిషినండి నేను..
మాణిక్యమన్నారు నన్ను
పల్లెకోయిలమ్మ తెల్లవారి కూసే కూతే నా పాట..
పంటచేనులోన పైరుకంకి పైన గాలే నా తాళం..
ఏలేలో.. ఏలేలో...నానవ్వే.. ఉయ్యాలో...
ఏలేలో.. ఏలేలో...నానవ్వే.. ఉయ్యాలో
చెమటచుక్క చదువులు నాయి..
కాయకష్టం పాఠాలు..
పయిటచెంగు దాచిన కంట్లో గురువే కన్నీళ్లు..
ఏతమేసి తోడానండీ నాలో ఉన్న రాగాలు..
దేవుడింక సాలన్నాడు పెట్టిన కష్టాలు..
పచ్చపచ్ఛాని పైరమ్మ పాట..
ఏరువాకల్లో నా ఎంకిపాట..
ముళ్ళదారే తీసి, పూలే ఏసి మీముందు ఉoచాయీపూట..
ఇది నాబతుకు పాట..తీపిరాగాల తోటి..
మావూరు దాటి మీకోసమొచ్చాను..
మట్టిమనిషినండి నేను..
మాణిక్యమన్నారు నన్ను
మట్టిమనిషినండి నేను..
మాణిక్యమన్నారు నన్ను
పల్లెకోయిలమ్మ తెల్లవారి కూసే కూతే నా పాట..
పంటచేనులోన పైరుకంకి పైన గాలే నా తాళం..
ఏలేలో.. ఏలేలో...నానవ్వే.. ఉయ్యాలో...
ఏలేలో.. ఏలేలో...నానవ్వే.. ఉయ్యాలో