Showing posts with label రోజాపూలు (2002). Show all posts
Showing posts with label రోజాపూలు (2002). Show all posts

ముచ్చటగా ముచ్చటగా


ముచ్చటగా ముచ్చటగా
చిత్రం: రోజాపూలు (2002)
రచన: భువనచంద్ర
సంగీతం: రమణీ భరద్వాజ్
గానం: బాలు, స్వర్ణలత

పల్లవి:

ముచ్చటగా ముచ్చటగా
మురిపించే విరులారా
కమ్మంగా నిదురించే 
చెలియని పిలవొద్దు
మెత్తని మీ పిలుపులకి
మగువ కల చెదిరేనూ
నెచ్చెలికల చెదిరిందో... 
నా హృదయం నీరవదా

ముచ్చటగా ముచ్చటగా
మురిపించే విరులారా
నను తలచి నిదురించే 
సఖుడిని పిలవొద్దు
మెత్తని మీ పిలుపులకే
ప్రేమ కల చెదిరేనూ...
అతని కల చెదిరిందో... 
నా హృదయం నీరవదా...

చరణం 1:

నీవొక పూవిస్తే
నా ఎదలో దాచుకుంటా
వాడిన పువ్వులనీ 
పైఎదగా మలచుకుంటా

నీ కళ్ళ వాకిలి ముందు 
నిదురను నేనై వాలనా
తెల్లార్లు మాటేవేసి 
మనసును దోచుకుపోనా

నువ్వొస్తే చాలోయ్ చినవాడా
నీ ఊపిరి నేనై ఉంటా

చరణం 2:

నాచెలి మధురస్వరం
ఎదనే తాకెనమ్మా
నెచ్చెలి ప్రియవచనం
ఆశలు రేపెనమ్మా

నదిని నేను కడలివి నీవు
నీలో నన్నూ చేర్చుకో
అలలవంటి అనురాగాన్ని 
నాతో నువ్వు పంచుకో

నిను చూసిన క్షణమే నా హృదయాన్ని
అర్పించేశా ప్రాణమా...ప్రాణమా