Showing posts with label రెండిళ్ళ పూజారి (1993). Show all posts
Showing posts with label రెండిళ్ళ పూజారి (1993). Show all posts

వీణల్లో తీగ ఏమంది?



వీణల్లో తీగ ఏమంది?
రెండిళ్ళ పూజారి (1993)
కీరవాణి
వేటూరి
చిత్ర, బాలు

వీణల్లో తీగ ఏమంది
రాగాలు నీవే లెమ్మంది
కొమ్మల్లో కూకూ ఏమంది
కోరింది నీకే ఇమ్మంది
ముద్దంటి పూబంతి
ముంగిళ్ళ సంక్రాతి
కన్నాను నిన్నలేని
నీలి ప్రేమలేఖలే

విరజాజి తిరునాళ్ళల్లో
విడిదే నీవై
పూబంతి విందులీయవా
మొగిలాకు పొదరిళ్ళల్లో
మొగుడే నీవై
సంపంగి ముద్దులీయవా

రచించా ప్రేమగీతం రసాల భాషలో
రుచించే పూలవేదం నిషాల తోటలో
వయ్యారాల వాలుజళ్ళో వాలుతున్న
మందారాల తేనెకోసం తుమ్మెదై

విన్నాను కొంగుచాటు కోడెగాలి పాటనే
వీణల్లో తీగ ఏమంది
రాగాలు నీవే లెమ్మంది
కొమ్మల్లో కూకూ ఏమంది
కోరింది నీకే ఇమ్మంది

పరువాల బరువే దించే పడవే నీవై
తూచాలి మల్లెపూలతో
తొలిసిగ్గు చలినే తెంచే కలికే నీవై
దాచాలి ఆశ కళ్ళల్లో
సహించా మాఘమాసం సఖా నీకోసమే
గ్రహించా మౌనగీతం సఖీ సందేశమే
కొత్తందాల కోనసీమ చేరుకున్నా
గోదారొడ్డు గోకులాన రాధనై

కావాలి యవ్వనాల నవ్వుకున్న కౌగిలే

వీణల్లో తీగ ఏమంది
రాగాలు నీవే లెమ్మంది
కొమ్మల్లో కూకూ ఏమంది
కోరింది నీకే ఇమ్మంది
ముద్దంటి పూబంతి
ముంగిళ్ళ సంక్రాతి
కన్నాను నిన్నలేని
నీలి ప్రేమలేఖలే