Showing posts with label మౌనరాగం (1986). Show all posts
Showing posts with label మౌనరాగం (1986). Show all posts

చిన్ని చిన్ని కోయిలల్లే


చిన్ని చిన్ని కోయిలల్లే
చిత్రం : మౌనరాగం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : జానకి

పల్లవి :

లాలలాల లాలలాల లాలలాల లాలలాల
లలలాల లలలాల లలలాల లలలాల
లలలాల లలలాల లాలా లాలాలాలా

చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
పులకించే సిరిమొగ్గ... నేనే..  నేనే

చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా

చరణం 1 :

మల్లెల బాటలోన...  పాటలే కోరుకుందీ
మన్మథుని పాటలోన...  గాధలే పాడుకుంది
ఊహలే జీవితం...  చిందెనే మాటలే
సాగెనే ఆశలే...  రేగెనే ఊసులే

మనసు ఊగి... మ్... మ్.. మ్.. మ్
మరులు రేగి... మ్.మ్.మ్.మ్
మనసు ఊగి... మ్.మ్.మ్.మ్
మరులు రేగి... మ్.మ్.మ్.మ్
అందరాని సన్నిధి నేనే.. నేనే.. నేనే

చిన్ని చిన్ని కోయిలల్లే...  కోరి కోరి కూసేనమ్మా
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
పులకించే సిరిమొగ్గ... నేనే..నేనే
చిన్ని చిన్ని కోయిలల్లే...  కోరి కోరి కూసెనమ్మా

చరణం 2 :

వెచ్చని సందె వేళ... బాసలే ఆడేనులే
పచ్చని కన్నెవయసు...  గంగలా పొంగేనులే
కమ్మని తేనెలే... గుండెలో తేలెనే
చీకటే వచ్చినా... ఊహలే ఊరేనే

జీవితాంతం... మ్.మ్.మ్.మ్
స్నేహరాగం... మ్.మ్.మ్.మ్
జీవితాంతం..మ్.మ్.మ్.మ్
స్నేహరాగం... మ్.మ్.మ్.మ్
పరువ రాగ కీర్తనం పాడె... పాడె... పాడె

చిన్ని చిన్ని కోయిలల్లే...  కోరి కోరి కూసెనమ్మా
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
పులకించే సిరిమొగ్గ... నేనే..నేనే

చిన్ని చిన్ని కోయిలల్లే...  కోరి కోరి కూసెనమ్మా
చిన్ని చిన్ని కోయిలల్లే...  కోరి కోరి కూసెనమ్మా

ఓహో మేఘమొచ్చెను

ఓహో మేఘమొచ్చెను
చిత్రం : మౌనరాగం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : జానకి

పల్లవి :

ఓహో మేఘమొచ్చెను...
ఏదో లాలి పాడెను
చినుకే పూల గాలులే...
పలికె పసిడి గాథలే
పువ్వులపై అందాలే...
వరహాలను పరిచేను
జల్లులు కురిసే సమయం...
ముచ్చటలే విరిసేను

ఓహో మేఘమొచ్చెను...
ఏదో లాలి పాడెను

చరణం 1 :

నాలో ఊగేను సోయగం...
రేగే ఊరేగే ఆశలే
నన్నే ఉడికించేనే బృందావనం
వయసు బంధాలు మీరెనే

ఈ పన్నీటిలో...
గారాలే చిందవా
ఓ అందాల గనికి
పూమాలే వెయ్యరా
ఈ అమ్మాయికి పెళ్ళి ఓ నాటకం
ఈ ఒయ్యారమంతా...
వలపించే జ్ఞాపకం
పులకరించి...  పలకరించెనే

ఓహో మేఘమొచ్చెను...
ఏదో లాలి పాడెను

చరణం 2 :

కలలో ఈ నాటి జీవితం...
ఆమని రాగాల బంధనం
వెండి మేఘాలలో ఊరేగుదాం...
మధుర సంగీతం పాడుదాం

లే చిగురాకులై ఈనాడు మారుదాం
రా వినువీధిలోన నవ్వుల్లో పాకుదాం
ఈ పరువాలలోన శంఖాలై ఊగుదాం
రయ్...  సెలయేరులై ఉరికురికి పొంగుదాం
ఇంత వింత వగలు పంచగా

ఓహో మేఘమొచ్చెను...
ఏదో లాలి పాడెను
చినుకే పూల గాలులే...
పలికె పసిడి గాథలే
పువ్వులపై అందాలే...
వరహాలను పరిచేను
జల్లులు కురిసే సమయం
ముచ్చటలే విరిసేను

ఓహో మేఘమొచ్చెను...
ఏదో లాలి పాడెను
ఆహా.. ఆ... పప...
పప్ప... ప్పా.... ఆహా