Showing posts with label మాయాబజార్ (1957). Show all posts
Showing posts with label మాయాబజార్ (1957). Show all posts

అల్లీబిల్లీ అమ్మాయికి


అల్లీబిల్లీ అమ్మాయికి
చిత్రం : మాయాబజార్ (1957)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : సుశీల

లల్లిలలా లల్లిలలా ఆ ఆ
లల్లిలల లల్లిలల లల్లి లల్లి లల్లిలల
లల్లిలల లల్లిలల లల్లి లల్లి లల్లిలల
అల్లిబిల్లి ఆటలే లల్లిలలా పాటలే
అల్లిబిల్లి ఆటలే లల్లిలలా పాటలే
ఎవరెవరే కోయిలలు
కుహూ కుహూ కుహూ కుహూ
ఎవరెవరె నెమళ్ళు ఆ ఆ కికి కికి కికి కికి
ఎవరెవరె ఎవరెవరె వన్నె లేడి పిల్లలు
ఎవరెవరె ఎవరెవరె వన్నె లేడి పిల్లలు
లల్లిలల లల్లిలల లల్లి లల్లి లల్లిలల
ఎవరెవరె ఎవరెవరె మల్లి లేడి పిల్లలు
లల్లిలల లల్లిలల లల్లి లల్లి లల్లిలల
కు కు కు

అల్లీబిల్లీ అమ్మాయికి
చలచల్లని జోస్యం చెపుతాము
తన చక్కని జోస్యం చెపుతాము

అల్లీబిల్లీ అమ్మాయికి
చలచల్లని జోస్యం చెపుతాము
తన చక్కని జోస్యం చెపుతాము

యవ్వన శోభల పర్వమే
ఇది బావను తలచుకు గర్వమే
యవ్వన శోభల పర్వమే
ఇది బావను తలచుకు గర్వమే
ఆ బావే తనకిక సర్వమే

అల్లీబిల్లీ అమ్మాయికి
చలచల్లని జోస్యం చెపుతాము
తన చక్కని జోస్యం చెపుతాము

వున్నమాటకి ఉలుకెందుకు
మరి ఉన్నదె చెపుతాము
వున్నమాటకి ఉలుకెందుకు
మరి ఉన్నదె చెపుతాము
వలదన్నా చెపుతాము
నూతన విద్యల ప్రవీణుడే
బల్ ప్రతిభావంతుడె మీ బావ
నూతన విద్యల ప్రవీణుడే
బల్ ప్రతిభావంతుడె మీ బావ
అతి చతురవీరుడే మీ బావ

అల్లీబిల్లీ అమ్మాయికి
చలచల్లని జోస్యం చెపుతాము
తన చక్కని జోస్యం చెపుతాము

మల్లీ జాజి మాలతి సంపెగ
పూల బాణములు వేను
మల్లీ జాజి మాలతి సంపెగ
పూల బాణములు వేసెను
బాలామణితో మురిసేను
మన బాలామణితో మురిసేను
తన పెళ్ళికి బావను పిలిచేను

అల్లీబిల్లీ అమ్మాయికి
చల చల్లని జోస్యం చెపుతాము
తన చక్కని జోస్యం చెపుతాము