Showing posts with label మజిలీ (2019). Show all posts
Showing posts with label మజిలీ (2019). Show all posts

ప్రియతమ ప్రియతమ

ప్రియతమ ప్రియతమ
చిత్రం: మజిలీ (2019)
సంగీతం: గోపీ సుందర్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: చిన్మయి

పల్లవి:

ప్రియతమ ప్రియతమ ..పలికినది హృదయమే సరిగమా..
చిలిపి నీ తలపులో..తెలిసినది వలుపులో మధురిమా..
చెలి చూపు తాకినా..ఉలకవా పలకవా..
వల వేసి వేచి చూస్తున్నా..దొరకనే దొరకవా..

ఇస్టమైన సఖుడా ఇస్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా..పిల్లడా..

చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా..

ప్రియతమ ఫ్రియతమ..పలికినది హృదయమే సరిగమా..
చిలిపి నీ తలపులో..తెలిసినది వలుపులో మధురిమా..

చరణం #1:

నీ ప్రేమలో ఆరాధనై, నీ నిండుగా మునిగాకా..
నీకొసమే రాసానుగా, నా కళ్ళతో ప్రియలేఖ..
చేరునో..చెరదో..తెలియదు ఆ కానుకా..
ఆశనే వీడక..వెనక పడేను మనసుపడిన మనసే

ఇస్టమైన సఖుడా ఇస్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా..పిల్లడా..

చరణం #2:

ఉన్నానిలా..ఉంటానిలా..నీ నీడగా..కడదాకా
కన్నీటిలో కార్తీకపూ..దీపాన్నిరా..నువ్వులేక
దూరమే భారమై..కదలదు నా జీవితం
నీవు నా చెరువై..నిలిచి మసలు మధుర క్షణములెపుడో

ప్రియతమ ఫ్రియతమ..పలికినది హృదయమే సరిగమా..
చిలిపి నీ తలపులో..తెలిసినది వలుపులో మధురిమా..

చెలి చూపు తాకినా..ఉలకవా పలకవా..
వల వేసి వేచి చూస్తున్నా..దొరకనే దొరకవా..

ఇస్టమైన సఖుడా
ఇస్టమైన సఖుడా
ఒక్కసారి చూడరా..పిల్లడా..

చక్కనైన చుక్కరా
చక్కనైన చుక్కరా
నిన్ను కోరుకుందిరా సుందరా..

ఏ మనిషికే మజిలీయో

ఏ మనిషికే మజిలీయో
చిత్రం : మజిలి (2019)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : వనమాలి
గానం : అరుణ్ గోపన్, చిన్మయి, బేబీ అనుష

ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు

నువ్వు..నిజంలాగ
నను ముడేస్తుంటె
ఈ నిమిషానా
నేను..గతంలోని
ఆ కలల్లోనె వున్నా..
నువ్వు..ప్రతీసారి
నీ ప్రపంచంలొ
నను చూస్తూన్నా..
నేను..అదే పనిగ
నిను వెలేస్తూనె వున్నా..
నువ్వు..నను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నేను..ఒక మనసులేని
శిలలాగ మారినానా..

ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు

నా నిన్నలోని
ఆ గురుతులన్నీ
ఈ మనసులోంచి
చెరిపేదెలాగా..?
ఇన్నాళ్ళు నాలో
కలిసున్న ప్రాణం
నే వేరు చేసి
బ్రతికేదెలాగ..?
ఈ వేషమే ఎన్నాళ్ళని
విధి ఆడుతోందా
ఈ నాటకాన్ని

నువ్వు..నిజంలాగ
నను ముడేస్తుంటె
ఈ నిమిషానా
నేను..గతంలోని
ఆ కలల్లోనె వున్నా..

నీ పిలుపు కోసం
వెతికింది మౌనం
ఆ వరము కోరి
మిగిలుంది ప్రాణం
నా గుండెనడుగు
చెబుతుంది నీకె
ఈ ఊపిరుందీ
నీ చెలిమి కొరకే
నీ కోసమె వెచిందిలే
నువు సేద తీరె
ఈ ప్రేమ మజిలీ

నేను నిజంలాగ
నిను ముడేస్తుంటె
ఈ నిమిషానా
నువ్వు గతంలోని
ఆ కలల్లోనె వున్నా
నేను ప్రతీసారి
నా ప్రపంచంలా
నిను చూస్తున్నా
నువ్వు అదేపనిగ
నను వెలేస్తూనె వున్నా
నేను నిను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నువ్వు ఒక మనసు లేని
శిలలాగ మారినావా..

ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు