Showing posts with label ప్రేమఖైదీ (1992). Show all posts
Showing posts with label ప్రేమఖైదీ (1992). Show all posts

నీ కళ్ళలో స్నేహమూ

నీ కళ్ళలో స్నేహమూ
ప్రేమఖైదీ (1992)
వేటూరి
రాజన్-నాగేంద్ర
బాలు, సుశీల

పల్లవి:

నీ కళ్ళలో స్నేహమూ
కౌగిళ్ళలో కాలము
పాడేదేరాగమౌనో
శ్రీరస్తు అన్నా శివరంజనీ
చివురించి నవ్వే నవరంజనీ

నీ నవ్వులో అందమూ
ఈ జన్మలా బంధమూ
పాడేదేరాగమైనా
శృంగారవీణా శివరంజనీ
పిలుపందుకున్నా ప్రియరంజనీ

నువ్వే ప్రాయం ప్రాణం..ఓ

చరణం 1:

ఉగాదులూ ఉషస్సులూ వలపున రాకా
పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే
మోడే చిగురించే ప్రణయ కథల్లో
రాలే పూల ఆశల్లోన మధువును నేనై
పిలుపులతో అలసితినీ బదులిక లేకా
నీవే జతలేనీ శిధిలశిలల్లో
ఉంటా వెయ్యేళ్ళు చిలిపికలల్లో

||నీ నవ్వులో||

చరణం 2 :

దిగులుపడే సొగసులతో దినములు సాగే
రుచులడిగే వయసులలో ఋతువులు మారే
నన్నే ప్రశ్నించే హృదయలయల్లో
పరువముతో పరిచయమే పరువునుతీసే
చెరిసగమౌ చెలిని ఇలా చెరలకు తోసే
ప్రేమాఖైదీగా ప్రణయ పుటల్లో
ఇంకా ఎన్నాళ్ళీ ఇరుకు గదుల్లో

||నీ కళ్ళలో||

I live for you అన్నది ప్రేమా

I live for you అన్నది ప్రేమా
ప్రేమఖైదీ (1992)
వేటూరి
రాజన్-నాగేంద్ర
బాలు, చిత్ర

పల్లవి:

I live for you అన్నది ప్రేమా
I die for you అన్నది ప్రేమా
నా పంచ ప్రాణాల పల్లవీ ప్రేమా
ప్రేమే నీ తోడు ప్రేమించీ చూడు
ఈ ప్రేమ వేదాల శృతిలో లయగా కలిసీ

||ఐ లివ్||

చరణం:

చిరునవ్వే విరిజల్లైనా
అందాలే హరివిల్లైనా
ఈ ప్రేమవర్ణాలతోనే

కౌగిళ్ళే కవ్విస్తున్నా
కసికళ్ళే కాటేస్తున్నా
ఈ ప్రేమ బాణాలతోనే
ఏ జన్మ గంధాలు పిలిచిందీ ప్రేమా
ఈ మౌనాల నా గానాల కళ్యాణాల పందిట్లోన

||ఐ లివ్||

చరణం:

వేదంలా మంత్రిస్తున్నా
వెన్నెల్లా మనసిస్తున్నా
ఈ ప్రేమ నీరాజనాలే
అనురాగం ముద్రిస్తున్నా
అధ్వైతం సిద్దిస్తున్నా
ఈ ప్రేమ ఆరాధనేలే
ధర్మార్ధ కామాలు దాటిందీ ప్రేమా
నీలోనేను నాలోనువ్వు జీవించేటి సందిట్లోన

||ఐ లివ్||