Showing posts with label పేట (2018). Show all posts
Showing posts with label పేట (2018). Show all posts

ఎక్కడ నువ్వున్నా(ఊల్లాల్లా)...

ఎక్కడ నువ్వున్నా(ఊల్లాల్లా)...
చిత్రం : పేట (2018)
సంగీతం : అనిరుధ్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : నకాష్ అజీజ్

ఎయ్ ఎక్కడ నువ్వున్నా
తలుపు తట్టద సంతోషం
నీ పెదవి అంచులకు
మెరుపులు కట్టద ఆకాశం
అరె ముట్టడి చేస్తున్నా
నిన్ను వెలుతురు వర్షం
గుర్తుపట్టను పొమ్మంటే
అయ్యో నీదేగా లోపం

ఎక్కడ నువ్వున్నా
తలుపు తట్టద సంతోషం
నీ పెదవి అంచులకు
మెరుపులు కట్టద ఆకాశం
అరె ముట్టడి చేస్తున్నా
నిన్ను వెలుతురు వర్షం
గుర్తుపట్టను పొమ్మంటే
అయ్యో నీదేగా లోపం

కళ్ళగ్గంతలు కట్టీ ఏంటీ చీకట్లనీ నిట్టూర్చొద్దూ
చుట్టూ కంచెలు కట్టీ లోకం చిన్నదనీ నిందించొద్దూ

రే బాబా నువ్వున్న చోటే చిరునవ్వుల నగరం
నీ అరికాలి కిందే ఆనంద శిఖరం
హే నీ నీడ నువ్వు వందేళ్ళ సమయం
జోడీగా పాడాలి ఊల్లాల్లా ఊల్లాల్లా

హే నువ్వున్న చోటే చిరునవ్వుల నగరం
నీ అరికాలి కిందే ఆనంద శిఖరం
హే నీ నీడ నువ్వు వందేళ్ళ సమయం
జోడీగా పాడాలి ఊల్లాల్లా ఊల్లాల్లా

హే జగమే నీ ఇల్లు జనమే నీ వాళ్ళూ
మనమంతా ఒకటంటే జగడాలకు చెల్లు
పిలిచే నీ కళ్ళూ ప్రేమకు వాకిళ్ళూ
పవనంలా ప్రతి మనిషిని ప్రశ్నిస్తూ వెళ్ళూ

హే జగమే నీ ఇల్లు జనమే నీ వాళ్ళూ
మనమంతా ఒకటంటే జగడాలకు చెల్లు
పిలిచే నీ కళ్ళూ ప్రేమకు వాకిళ్ళూ
పవనంలా ప్రతి మనిషిని ప్రశ్నిస్తూ వెళ్ళూ

రెండు గుండెల అంతరం ఎంతా
చేయి చాచిన దూరం కాదా
పరులే లేరనుకుంటే లోకం
ఒకటే కుటుంబమై పోదా

రే బాబా నువ్వున్న చోటే చిరునవ్వుల నగరం
నీ అరికాలి కిందే ఆనంద శిఖరం
హే నీ నీడ నువ్వు వందేళ్ళ సమయం
జోడీగా పాడాలి ఊల్లాల్లా ఊల్లాల్లా

హే నువ్వున్న చోటే చిరునవ్వుల నగరం
నీ అరికాలి కిందే ఆనంద శిఖరం
హే నీ నీడ నువ్వు వందేళ్ళ సమయం
జోడీగా పాడాలి ఊల్లాల్లా ఊల్లాల్లా

ఎయ్ ఎక్కడ నువ్వున్నా
తలుపు తట్టద సంతోషం
నీ పెదవి అంచులకు
మెరుపులు కట్టద ఆకాశం
అరె ముట్టడి చేస్తున్నా
నిన్ను వెలుతురు వర్షం
గుర్తుపట్టను పొమ్మంటే
అయ్యో నీదేగా లోపం

మరణం మాసు

మరణం మాసు
పేట (2018),
అనిరుద్ రవిచందర్,
బాలు, అనిరుద్

రచ్చాడుకోక రాయలో సాంగా
ఊళ్ళోకి వచ్చాడు పెద్దపులి లాగా

రచ్చాడుకోక రాయలో సాంగా
ఊళ్ళోకి వచ్చాడు పెద్దపులి లాగా
టచ్ చేయకుండా చూసై దూరంగా
మర్యాద పోకుండా తిరిగొచ్చై బేగా

కట్టా నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే
ఇట్టా దడలుపుట్టి దమ్ము దమారే...
స్లీవు మడత పెట్టి కాలరెగరేసుకొస్తు
జూలు విదిలిస్తే జుమ్ముజుమారే...

మరణం మాసు మరణం టఫ్ఫు తరుణం
అతడి పేరే మనకు శరణం
మాసు మరణం  టఫ్ఫు  తరుణం
స్టెప్పులేసే కిరణం

రచ్చాడుకోక రాయలో సాంగా
ఊళ్ళోకి వచ్చాడు పెద్దపులి లాగా
టచ్ చేయకుండా చూసై దూరంగా
మర్యాద పోకుండా తిరిగొచ్చై బేగా

ఎవడు పైన ఎవడు కింద
ఎల్ల మనుషులు ఒకటేరా బాసూ
ప్రతి ఒకరినీ ఆదరించు తలమీదెత్తుకొని చూస్తారు ఊరు
న్యాయం వెనుకే అడుగేయ్ ఓరయ్యా నే నీ వెనకే చివరి వరకు
కాలు లాగి ఎరగా వద్దయ్యా కాల యముడై పడతా జరుగు

కట్టా నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే
ఇట్టా దడలుపుట్టి దమ్ము దమారే...
స్లీవు మడత పెట్టి కాలరెగరేసుకొస్తు
జూలు విదిలిస్తే జుమ్ముజుమారే...

మరణం మాసు మరణం టఫ్ఫు తరుణం
అతడి పేరే మనకు శరణం
మాసు మరణం  టఫ్ఫు  తరుణం
స్టెప్పులేసే కిరణం

రచ్చాడుకోక రాయలో సాంగా
ఊళ్ళోకి వచ్చాడు పెద్దపులి లాగా
టచ్ చేయకుండా చూసై దూరంగా
మర్యాద పోకుండా తిరిగొచ్చై బేగా

మరణం మాసు మరణం టఫ్ఫు తరుణం
అతడి పేరే మనకు శరణం
మాసు మరణం  టఫ్ఫు  తరుణం
స్టెప్పులేసే కిరణం