Showing posts with label నేనున్నాను (2004). Show all posts
Showing posts with label నేనున్నాను (2004). Show all posts

నీకోసం నీకోసం నీకోసం


నీకోసం నీకోసం నీకోసం
చిత్రం : నేనున్నాను (2004)
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కె.కె, శ్రేయా ఘోషాల్

పల్లవి: 

వేసంకాలం వెన్నెల్లాగా 
వానల్లొ వాగుల్లాగ 
వయసు ఎవరికోసం
తోం ధిరి తోం ధిరి తోం ధిరి 
ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి
శీతాకాలం ఎండల్లాగ 
సంక్రాతి పండుగలాగ 
సొగసు ఎవరికోసం
తోం ధిరి తోం ధిరి తోం ధిరి 
ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి
ఓరోరి అందగాడా 
నన్నేలు మన్మధుడా
నీకోసం నీకోసం నీకోసం 
నీకోసం నీకోసం నీకోసం
నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండుగ చేసే సందడివేళ 
ఆకూ వక్కా సున్నం
నీకోసం నీకోసం నీకోసం 
నీకోసం నీకోసం నీకోసం

ఏ శ్వాసలో చేరితే


ఏ శ్వాసలో చేరితే
చిత్రం : నేనున్నాను(2004)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : చిత్ర

వేణుమాధవా ఆ....
వేణుమాధవా ఆ....

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..
ఆ శ్వాసలో ..ఓ..నే లీనమై...
ఆ మోవిపై ..ఈ..నే మౌనమై...
నిను చేరనీ మాధవా ఆ ఆ ఆ...

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో

మునులకు తెలియని జపములు జరిపినదా.. మురళీ సఖీ
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా...
తనువును నిలువున తొలిచిన గాయములే.. తన జన్మకీ
తరగని వరముల సిరులని తలచినదా..
కృష్ణా నిన్ను చేరింది..అష్టాక్షరిగ మారింది
ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిధీ...ఈ...

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..

చల్లని నీ చిరునవ్వులు కనపడక కనుపాపకీ..
నలువైపుల నడిరాతిరి ఎదురవదా...
అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికీ..
అలజడితో అణువణువూ తడబడదా...
ఆ....ఆ....ఆ....ఆ....ఆ...........
నువ్వే నడుపు పాదమిది...
నువ్వే మీటు నాదమిది..
నివాళిగా నా మది..
నివేదించు నిమిషమిది...
వేణుమాధవా నీ సన్నిధీ.... ఈ..ఈ...

గగరిగరిసరి గగరిరి సరి
గపదసాస దపగరిసరి..
గగదపదా గపదసదా దాపాగరిగా..
దపదసస దపదసస
దపదరిరి దపదరిరి
దసరిగరిసరి
గరిసరి గ రి గరిసరిగా...
రి స ద ప గగగ పాప
ద ప ద ద ద గ స ద స స
గ ప ద స రి స రి స రి స ద స రి
గ ద స ప గ రి ప ద ప ద స రి
స రి గ ప గ రి
స గ ప ద ప స గ స
ప ద ప స గ స
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గా
రి గ ప ద రి గా.....

రాధికా హృదయ రాగాంజలీ....
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ...
ఈ గీతాంజలి....