Showing posts with label నీ స్నేహం (2002). Show all posts
Showing posts with label నీ స్నేహం (2002). Show all posts

చినుకు తడికి చిగురు



చినుకు తడికి చిగురు
నీ స్నేహం (2002)
ఆర్. పి. పట్నాయక్
సిరివెన్నెల
ఉష

పల్లవి: 

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలే మనసుపడు పాదమా....
ఊహలే ఉలికిపడు ప్రాయమా....
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా 

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

చరణం 1:

పసిడి వేకువలు పండు వెన్నెలలు
పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో బ్రహ్మ

స్వచ్చమైన వరిచేల సంపదలు
అచ్చతెనుగు మురిపాల సంగతులు
కళ్ళముందు నిలిపావె ముద్దుగుమ్మా

పాలకడలి కెరటాలవంటి నీ లేత అడుగు
తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా 
ఆగని సంబరమా 

చరణం 2:

వరములన్ని నిను వెంటబెట్టుకుని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవే 
కుందనాల బొమ్మా
సిరుల రాణి నీ చేయి పట్టి 
శ్రీహరిగ మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగారకీర్తనల వర్ణనలకు ఆకారమైన
బంగారు చిలకవమ్మా
ఆ ఆ ఆ ఆ కాముని సుమశరమా ఆ ఆ