Showing posts with label నాయనమ్మ. Show all posts
Showing posts with label నాయనమ్మ. Show all posts

"నాయనమ్మ" మీద జానకి గారు పాడిన పాట.

"నాయనమ్మ" మీద జానకి గారు పాడిన పాట. ఇక్కడ జానకి గారి కంఠంలో రెండు గొంతుల మిమిక్రీని వినవచ్చు.

నాయనమ్మా...
సంగీతం: ఎల్.కృష్ణన్
రచన: సాయికృష్ణ యాచేంద్ర
గానం: ఎస్.జానకి

పల్లవి:

నాయనమ్మా...నాయనమ్మా
మాయని ప్రేమే నీదమ్మా
మాయని ప్రేమే నీదమ్మ
ఓ...
నాయనమ్మా...నాయనమ్మా
మాయని ప్రేమే నీదమ్మా
మాయని ప్రేమే నీదమ్మ

చరణం 1:

గోరుముద్దలను తినిపించి
కోరినవన్నీ అందించే
గోరుముద్దలను తినిపించి
కోరినవన్నీ అందించే
నీకేమివ్వను నాయనమ్మా
నా మనసేమో నీదమ్మ
నీ ఒడి మాకూ గుడి అమ్మా
నాయనమ్మా...నాయనమ్మా
మాయని ప్రేమే నీదమ్మా
మాయని ప్రేమే నీదమ్మ

చరణం 2:

సత్యం ధర్మం శాంతీ ప్రేమా
నిత్యకృత్యముగ భావించి
తెలుగుదేశమును రామరాజ్యముగ
మలచే భావిపౌరులు మీరై
నడచిన చాలు
అడుగను వేరు
నా నమ్మకదే పదివేలు
నాయనమ్మా...నాయనమ్మా
మాయని ప్రేమే నీదమ్మా
మాయని ప్రేమే నీదమ్మ

చరణం 3:

అమ్మ నాన్న కొట్టినప్పుడు
ఆదరించి మము లాలించేవు
అమ్మ నాన్న కొట్టినప్పుడు
ఆదరించి మము లాలించేవు
అడగకముందే అన్నీ ఇచ్చి
దేవతలాగా దీవించేవు
మాకోసం నువు జీవించేవు
నాయనమ్మా...నాయనమ్మా
మాయని ప్రేమే నీదమ్మా
మాయని ప్రేమే నీదమ్మ

చరణం 4:

మంచితనానికి మణిదీపాలై
వంచన తుడిచి వర(ఱ)లాలి
శ్రమజీవనమే నడపాలి
జాతికి ఊపిరి పోయాలి
క్రమశిక్షణతో సమభావనతో
ఎల్లవేళలా మెలగాలి
నాయనమ్మా...నాయనమ్మా
మాయని ప్రేమే నీదమ్మా
మాయని ప్రేమే నీదమ్మ

నాయనమ్మా...నాయనమ్మా
మాయని ప్రేమే నీదమ్మా
మాయని ప్రేమే నీదమ్మ