Showing posts with label చందమామ (2007). Show all posts
Showing posts with label చందమామ (2007). Show all posts

నాలో ఊహలకు నాలో ఊసులకు


నాలో ఊహలకు...
చిత్రం : చందమామ (2007)
గానం: ఆశా భోస్లే, కె.ఎం.రాధాకృష్ణన్
రచన్ : అనంత శ్రీరాం
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్.

నాలో ఊహలకు నాలో ఊసులకు
అడుగులు నేర్పావూ
నాలో ఆశలకు నాలో కాంతులకు
నడకలు నేర్పావూ
పరుగులుగా.. పరుగులుగా
అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ!
II నాలో ఊహలకు II

ముక్కుపై ముద్దు పెట్టు

ముక్కుపై ముద్దు పెట్టు
చిత్రం: చందమామ (2007)
సంగీతం: కె.యమ్. రాధాకృష్ణన్
సాహిత్యం: సాయి శ్రీహర్ష
గానం: హరిచరణ్, సుజాత

ముక్కుపై ముద్దు పెట్టు ముక్కెరై పోయెట్టు
చెంపపై ముద్దు పెట్టు చెక్కరై పోయెట్టు
మీసంపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు
గడ్డంపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు

మొదట నుదిటి మీద ఒక్క బొట్టు ముద్దు
ఆ పిదప చెవికి చిన్న బుట్ట ముద్దు
మత్తు మెడకు ఒక్క మొక్క జొన్న ముద్దు
గమ్మత్తు గొంతుకొక్క సన్నజాజి ముద్దు
బుగ్గ పండు కోరికేసె రౌడీ ముద్దు
కొంటె ఈడూ కాజేసే కేడి ముద్దు
కంత్రి ముద్దు జాగజ్జంత్రి ముద్దు
కంత్రి ముద్దు జాగజ్జంత్రి ముద్దు
ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆ...
ముక్కుపై ముద్దు పెట్టు

వగల నడుము మడత మీద వడ్డానం ముద్దు
ఈ నాభి చుట్టు వేడి సెగల సిగ్గానం ముద్దు
ఒంటి వన్నె చిన్నె విన్నపాల ముద్దు
పువ్వంటి కన్నెకొక్క జున్నుపాల ముద్దు
అల్లరాణి వల్ల కానిగా అల్లరి ముద్దు
అల్లసాని పద్య మంత అల్లిక ముద్దు
ఆవకాయ్ ముద్దు ఆది ఆంధ్రా ముద్దు
ఆవకాయ్ ముద్దు ఆది ఆంధ్రా ముద్దు
ముద్దు ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆ...

ముక్కుపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు
చెంపపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు
ముక్కుపై ముద్దు పెట్టు